చిట్కాలు

దీన్ని రోజూ రెండు సార్లు తాగితే అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, అతిగా భోజ‌నం చేయ‌డం, జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం, స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, ఆల‌స్యంగా నిద్ర పోవ‌డం, మేల్కొన‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది అధికంగా బ‌రువు పెరుగుతున్నారు. దీంతో డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ బాగా ప‌నిచేస్తుంది. దాంతో బ‌రువును ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

take this daily to reduce weight quickly

1. ఒక గ్లాస్ నీటిలో రెండు టీస్పూన్ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌, 2 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి క‌లిపి ఈ మిశ్ర‌మాన్ని రోజూ 3 పూట‌లా తాగుతుండాలి. దీంతో కొద్ది రోజుల్లోనే అధిక బ‌రువు త‌గ్గుతారు.

2. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 2 టీస్పూన్ల తేనె, అంతే మోతాదులో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ల‌ను క‌లిపి రోజూ ఉద‌యం, సాయంత్రం తాగాలి. దీంతో అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

3. ఏదైనా పండు నుంచి ర‌సం తీసి దాన్ని ఒక గ్లాస్ మోతాదులో తీసుకోవాలి. అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ క‌లిపి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగాలి. ఇలా చేసినా బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు.

4. గ్రీన్ తాగిన‌ప్పుడు అందులో ఒక టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. దీంతో బ‌రువు త‌గ్గుతుంది.

5. ఫ్రూట్ స‌లాడ్స్ లేదా ఒక టీస్పూన్ వెల్లుల్లి ర‌సంతోనూ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను తీసుకోవ‌చ్చు. దీంతో కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు.

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను వాడ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌డం మాత్ర‌మే కాదు, షుగ‌ర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డ‌యాబెటిస్ త‌గ్గుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts