Kaki Donda Kayalu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయలు ఒకటి. ఇతర కూరగాయల వలె దొండకాయలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దొండతీగలో రెండు రకాలు ఉంటాయి. మనం ఆహారంగా తీసుకునే దొండకాయలతో పాటు కాకి దొండ అనిమరోరకం దొండతీగ కూడా ఉంటుంది. దీనిని అడవి దొండ, చేదు దొండ అనీ కూడా అంటారు. దీనిని సంస్కృతంలో రక్తఫలా, తుండీకేరి అని హిందీలో కండారి అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం కాక్సినియా ఇండికా. ఈ కాకి దొండకాయలు చాలా చేదుగా ఉంటాయి. గ్రామాల్లో నివసించే వారు ఈ కాకదొండను చూసే ఉంటారు. రోడ్ల పక్కన చేల కంచెలకు, పెద్ద పెద్ద చెట్లకు అల్లుకుని ఈ దొండతీగ పెరుగుతుంది. కాకి దొండ తీగ కూడా సాధారణ దొండతీగ లాగే కనిపిస్తుంది.
ఈ కాకి దొండకాయ పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో, పండిన తరువాత ఎరుపు రంగులో ఉంటుంది. ఈ కాకి దొండకాయ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కాకిదొండకాయ వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాకిదొండకాయలతో కూర వండుకుని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే దీనిలో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల నాడీ మండల వ్యాధులు, మతిమరుపు, శ్వాస సంబంధిత సమస్యలు వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అలాగే పచ్చిగా ఉన్న కాకిదొండకాయను తినడం వల్ల నోట్లో పుండ్లు, నోటి అల్సర్లు తగ్గుతాయి.
మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఈ కాకి దొండకాయలను తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటుంది. అలాగే వాంతులతో బాధపడే వారు ఈ అడవి దొండలో ఉండే గింజలను పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్రాము మోతాదులో తేనెతో కలిపి తీసుకోవడం వల్ల వాంతులు తగ్గుతాయి. ఈ అడవి దొండ తీగలో ప్రతి భాగం కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని ఎక్కువగా డయాబెటిస్ కు సంబంధించిన మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ దొండ ఆకుల రసాన్ని 5 నుండి 10 గ్రాముల మోతాదులో క్రమం తప్పకుండా 40 రోజుల పాటు తీసుకోవడం వల్ల డయాబెటిస్ పూర్తిగా అదుపులోకి వస్తుంది. ఈ ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల డయాబెటిస్ వల్ల కలిగే ఇతర సమస్యల బారిన కూడా పడకుండా ఉంటారు. అలాగే ఈ కాకి దొండ ఆకుల రసాన్ని గేదె పెరుగుతో కలిపి తీసుకుంటే వారం రోజుల్లోనే కామెర్ల వ్యాధి తగ్గు ముఖం పడుతుంది.
గజ్జి, తామర, దురద వంటి చర్మ సమస్యలతో బాధపడే వారు ఈ కాకిదొండ ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని చర్మ వ్యాధులు ఉన్న చోట లేపనంగా రాయాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ఎటువంటి చర్మ సంబంధిత సమస్యలైనా తగ్గు ముఖం పడతాయి. అలాగే ఈ పేస్ట్ ను గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా తగ్గుతాయి. ఈ కాకి దొండ ఆకులు దొరకని వారు వీటితో నూనెను తయారు చేసుకుని కూడా చర్మ వ్యాధులను నయం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఈ నూనెను తయారు చేసుకోవడానికి గానూ కళాయిలో కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను పోసి వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడయ్యాక ఈ కాకి దొండ ఆకులను వేసి నల్లగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి. ఇలా వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి నూనెను వడకట్టి గాజు సీసాలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రాసుకోవడం వల్ల కూడా చర్మ వ్యాధులు, గాయాలు తగ్గుతాయి.
అలాగే కాకి దొండ ఆకులను, నల్ల ఉమ్మెత ఆకులను, చిక్కుడు ఆకులను మెత్తగా నూరి వాటి నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని అరికాళ్లల్లో రాసుకోవడం వల్ల అరికాళ్లల్లో మంటలు తగ్గుతాయి. స్త్రీలల్లో వచ్చే గర్భాశచ దోషాలను తగ్గించడంలో కూడా ఈ కాకి దొండ ఉపయోగపడుతుంది. ఈ దొండఆకుల రసాన్ని అలాగే ఆవల పిండిని, వెల్లుల్లి రసాన్ని సమానంగా తీసుకుని 3 గ్రాముల మోతాదుగా మెత్తని ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను పూటకు ఒకటి చొప్పున మూడు పూటలా నీటితో కలిపి తీసుకోవడం వల్ల గర్భాశయ దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా కాకి దొండతీగ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.