Mustard Leaves : ఈ మొక్క ఆకులు ఎక్క‌డ క‌న‌బ‌డినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Mustard Leaves : ఆవాలు లేని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఆవాల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఆవాలు కూడా ఔష‌ధ గుణాల‌ను అధికంగా క‌లిగి ఉంటాయి. వీటిని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఈ ఆవాల‌ను ట్రేస్ లో లేదా నేల మీద వేసి మొల‌కెత్తించి మైక్రో గ్రీన్స్ లాగా త‌యారు చేసుకుని వంట‌ల్లో కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. అలాగే ఆవ ఆకుల‌ను కూడా కూర‌గా చేసుకుని తిన‌వ‌చ్చు. ఆవ‌కూర‌ల‌తో చేసిన కూర‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. వండ‌డం వ‌ల్ల కూర‌ల్లో ఉండే విట‌మిన్ సి న‌శిస్తుంది. కానీ ఆవ ఆకుల‌ను వండిన‌ప్ప‌టికి దానిలో ఉండే విట‌మిన్ న‌శించ‌కుండా ఎక్కువ మోతాదులో అలాగే ఉంటుంది. అదే విధంగా దీనిలో ఉండే మైక్రో న్యూటియ‌న్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా న‌శించ‌కుండా ఉంటాయి.

యాంటీ క్యాన్స‌ర్ ఆకు అని ఆవ ఆకుకు పెట్టింది పేరు. లంగ్ క్యాన్స‌ర్ రాకుండా చేయ‌డానికి వ‌చ్చిన వారికి త‌గ్గించ‌డంలో కూడా ఈ ఆవ ఆకు ఉప‌యోగప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ర‌క్ష‌ణ క‌ణాల‌ను ఉత్తేజ‌ప‌రిచి క్యాన్స‌ర్ క‌ణాల‌ను మొద‌టి ద‌శ‌లోనే గుర్తించి వాటిని తొల‌గించడంలో అలాగే క్యాన్స‌ర్ ఇత‌ర క‌ణాల‌కు వ్యాప్తి చెంద‌కుండా చేయ‌డంలో కూడా ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప‌రిశోధ‌న‌ల ద్వారా క‌నుగొన్నారు. గోధుమ గ‌డ్డి మాదిరి ఆవాల‌ను కూడా ప్లాస్టిక్ ట్రేల‌లో పెంచుకుని వాటిని స‌లాడ్స్ లో, మొల‌కెత్తిన గింజ‌ల్లో, కూర‌ల్లో వేసుకుని తిన‌వ‌చ్చు. ఆవాల‌ను మైక్రో గ్రీన్స్ లాగా త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో పోషకాలు ఎక్కువ‌గా ఉంటాయి. మొల‌కెత్తించిన ఆవాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి మెరుగుప‌డుతుంది.

Mustard Leaves benefits in telugu must know about them
Mustard Leaves

వైర‌ల్, బ్యాక్టీరియ‌ల్ ఇన్ఫెక్ష‌న్ లు మ‌న దరి చేర‌కుండా ఉంటాయి. అదే విధంగా ఆవాల‌ను ఆకుకూర‌లు పండించిన‌ట్టు పండించి ఆకును బాగా ఎద‌గ‌నివ్వాలి. ఆవ ఆకు చ‌క్క‌గా ఎదిగిన త‌ర‌వుఆత దానిని క‌ట్ చేసుకుని ప‌ప్పు లాగా, వేపుడు లాగా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. అలాగే ఈ ఆకుల‌ను ఉడికించి గోధుమ పిండితో క‌లుపుకుని చ‌పాతీలాగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పూర్వ కాలంలో ఈ ఆవాకును ఎక్కువ‌గా వండుకుని తినేవారు. దీనిని తిన‌డం వ‌ల్ల స‌హ‌జ సిద్దంగా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా కూడా ఉండ‌వ‌చ్చు. ఈ విధంగా ఆవ ఆకుల‌ను ఇంట్లోనే పెంచుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts