Nalla Ummetha Chettu : ఈ ఆకు.. బంగారం కంటే విలువైంది.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్టొద్దు..!

Nalla Ummetha Chettu : ఉమ్మెత్త‌.. మ‌న ఇంటి చుట్టే ప‌రిస‌రాల్లో ఉండే అద్భుత‌మైన ఔష‌ధ మొక్క‌ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఉమ్మెత్త‌ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. అనేక మొండి వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. పొడ‌వాటి తెల్ల‌టి పూల‌ను, ముళ్లు క‌లిగిన కాయ‌ల‌ను ఇది క‌లిగి ఉంటుంది. ఉమ్మెత‌లో కూడా తెల్ల ఉమ్మెత్త‌, న‌ల్ల ఉమ్మెత్త‌ అని రెండు ర‌కాలు ఉంటాయి. తెల్ల ఉమ్మెత్త‌తో పాటు న‌ల్ల ఉమ్మెత కూడా అనేక ఔష‌ధ గుణాలను క‌లిగి ఉంటుంది. ఎన్ని ఔష‌ధ గుణాలు క‌లిగి ఉన్న‌ప్ప‌టికి దీనిని బాహ్యంగానే ఉప‌యోగించాలి. లోనికి మాత్రం ఔష‌ధంగా తీసుకోకూడ‌దు. న‌ల్ల ఉమ్మెత్త‌ ఆకుల‌ను సేక‌రించి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత వీటికి నువ్వుల నూనె రాసి వేడి చేయాలి. ఆకులు గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత నొప్పుల‌పై ఉంచి క‌ట్టుక‌ట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, సెగ గ‌డ్డ‌లు, స్త్రీల‌ల్లో వ‌చ్చే స్థ‌నాల వాపు వంటి సమ‌స్య‌లు త‌గ్గుతాయి.

అలాగే త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఉమ్మెత్త‌ ఆకుల‌ను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఉమ్మెత్త‌ ఆకుల‌కు నూనె రాసి త‌ల‌పై ఉండ‌చం వ‌ల్ల క్ర‌మంగా త‌ల‌నొప్పి తగ్గుతుంది. పిచ్చి కుక్క కాటు వ‌ల్ల క‌లిగే విష ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డంలో కూడా ఈ ఉమ్మెత్త‌ చెట్టు మ‌నకు స‌హాయ‌ప‌డుతుంది. ఉమ్మెత్త‌ ఆకుల‌ను నూరి ర‌సాన్ని తీయాలి. ఈ రసాన్ని కుక్క కాటుకు గురి అయిన చోట పోయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల విష ప్ర‌భావం త‌గ్గుతుంది. అదేవిధంగా ఆస్థ‌మాతో బాధ‌ప‌డే వారు ఎండిన న‌ల్ల ఉమ్మెత్త‌ఆకుల‌ను కాల్చ‌గా వ‌చ్చిన పొగ‌ను పీల్చ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అదే విధంగా న‌ల్ల ఉమ్మెత్త‌ చెట్టు వేరును పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మొల‌ల‌పై రాయ‌డం వ‌ల్ల మొల‌లు ఎండిపోయి రాలిపోతాయి. న‌ల్ల ఉమ్మెత్త‌ ఆకుల ర‌సాన్ని అరి కాళ్ల‌లో రాయడం వ‌ల్ల అరికాళ్ల‌ల్లో మంట‌లు, తిమ్మిర్లు త‌గ్గుతాయి. అలాగే చ‌ర్మ వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఈ ఆకుల ర‌సం మ‌నకు స‌హాయ‌ప‌డుతుంది.

Nalla Ummetha Chettu benefits in telugu must know about it
Nalla Ummetha Chettu

న‌ల్ల ఉమ్మెత్త‌ ఆకుల ర‌సాన్ని గ‌జ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధుల‌పై రాయ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. అలాగే ఈ ఆకుల ర‌సాన్ని పేను కొరుకుడు స‌మ‌స్య ఉన్న చోట వ‌ల్ల ఆ ప్రాంతంలో స‌మ‌స్య త‌గ్గడంతో పాటు మ‌ర‌లా వెంట్రుక‌లు కూడా వ‌స్తాయి. కేవ‌లం ఆరోగ్యప‌రంగానే కాదు ధ‌నాక‌ర్ష‌ణ‌కు కూడా దీనిని ఉప‌యోగిస్తారు. వ్యాపార సంస్థ‌ల ముందు ఈ చెట్టును పెంచ‌డం వ‌ల్ల లాభాలు పెరుగుతాయి. ఇంట్లో ధ‌నం దాచే చోట ఈ మొక్క ఆకుల‌ను ఉంచ‌డం వ‌ల్ల ధ‌న‌లాభం క‌లుగుతుంది. అలాగే ఈ చెట్టు వేరును తాయ‌త్తులా మెడ‌లో క‌ట్టుకుంటే దిష్టి త‌గ‌ల‌కుండా ఉంటుంది. ఈ విధంగా న‌ల్ల ఉమ్మెత్త‌ మ‌న‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts