Papaya Leaves Juice : బొప్పాయి ఆకుల ర‌సాన్ని తాగితే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Papaya Leaves Juice : బొప్పాయి పండ్లు మ‌న‌కు సంవ‌త్స‌రం పొడవునా ఏ సీజ‌న్‌లో అయినా స‌రే ల‌భిస్తాయి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బొప్పాయి పండ్ల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాలు ఉంటాయి. అయితే కేవ‌లం ఈ పండ్లే కాదు.. ఈ చెట్టు ఆకులు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బొప్పాయి ఆకుల నుంచి తీసిన ర‌సాన్ని రోజూ అర టీస్పూన్ మోతాదులో ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తీసుకోవాలి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. బొప్పాయి ఆకుల‌తో మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి ఆకుల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతో సీజ‌న‌ల్ వ్యాధులు రావు. అలాగే విష జ్వ‌రాలు రాకుండా అడ్డుకోవ‌చ్చు. ముఖ్యంగా ప్లేట్ లెట్ల సంఖ్య పెరుగుతుంది. అందుక‌నే డెంగ్యూ వ‌చ్చిన వారికి బొప్పాయి ఆకుల ర‌సం తాగాల‌ని సూచిస్తుంటారు. ఇక ఈ ర‌సం తాగితే ప‌పైన్‌, కైమోప‌పైన్ అనే ఎంజైమ్ లు మ‌న శ‌రీరానికి ల‌భిస్తాయి. దీని వ‌ల్ల గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ ఆకుల ర‌సంలో ఉండే ఆల్క‌లాయిడ్ స‌మ్మేళ‌నాలు చుండ్రును అరిక‌డ‌తాయి. బ‌ట్ట‌త‌ల కాకుండా నివారిస్తాయి. జుట్టు పెరిగేలా చేస్తాయి. ఈ ఆకుల ర‌సంలో విట‌మిన్లు ఎ, సి, ఇ, కె, బి లు అధికంగా ఉంటాయి. క‌నుక మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ ల‌భిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.

Papaya Leaves Juice benefits in telugu must take daily
Papaya Leaves Juice

బొప్పాయి ఆకుల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల జ్వ‌రం త‌గ్గుతుంది. అలాగే అల‌స‌ట‌, త‌ల‌నొప్పి, వికారం, చ‌ర్మంపై దద్దుర్లు, దుర‌ద‌లు, వాంతులు వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ ఆకుల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. డ‌యాబెటిస్ స‌మ‌స్య నుంచి క్ర‌మంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే ఈ ఆకుల ర‌సంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్‌ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేసేలా పాంక్రియాస్‌ను ప్రోత్స‌హిస్తాయి. క‌నుక షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఇక ఈ ఆకుల ర‌సాన్ని తీసుకుంటే గ్యాస్‌, క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. వాపుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.

బొప్పాయి ఆకుల ర‌సాన్ని తాగితే చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారుతుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. అలాగే క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. క‌నుక బొప్పాయి ఆకుల ర‌సాన్ని రోజూ తీసుకోవాలి. అయితే ఈ ర‌సం మోతాదుకు మించితే వాంతులు, విరేచ‌నాలు సంభ‌విస్తాయి. క‌నుక వైద్యుల స‌ల‌హా మేర‌కు ఈ ర‌సాన్ని తీసుకోవ‌డం ఉత్త‌మం. లేదంటే ఇబ్బందులు ఎదుర‌య్యేందుకు అవ‌కాశాలు ఉంటాయి.

Editor

Recent Posts