Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

Gadida Gadapaku : ఈ భూమి మీద ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉన్నాయి. వీటిలో గాడిద‌గ‌డ‌పాకు మొక్క కూడా ఒక‌టి. దీనిని గాడిద గ‌డ్డ‌పారాకు అని కూడా అంటారు. ఈ మొక్క‌ను సంస్కృతంలో విష గంధిక‌, కీట‌క‌మారి అని, హిందీలో హీడా మారి అని అంటారు. ఈ మొక్క‌లు రేగ‌డి భూముల‌లో అడుగు ఎత్తు వ‌ర‌కు పెరుగుతాయి. చ‌లికాలంలో ఈ మొక్క‌లు ఎక్కువ‌గా పెరుగుతాయి. ఈ మొక్క పువ్వులు ఎరుపు, న‌లుపు రంగులో పూస్తాయి. ఆకులు గుండ్రంగా మ‌ద‌పు వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. ఈ మొక్క కాడ‌లు గ‌ట్టిగా ఉంటాయి. ఈ మొక్క వేరు చేదు రుచిని క‌లిగి ఉంటుంది. విరేచ‌నం సాఫీగా అయ్యేలా చేయ‌డంలో గాడిద‌గ‌డ‌పాకు మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

వాత రోగాల‌ను, స‌ర్ప విషాల‌ను, గ‌డ్డ‌ల‌ను, చ‌ర్మ రోగాల‌ను, వ్ర‌ణాల‌ను, క‌డుపు నొప్పిని త‌గ్గించ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. గాడిద‌గ‌డ‌పాకు ప‌చ్చి మొక్క‌ను తీసుకుని దంచి దానికి ఆముదాన్ని క‌లిపి వేడి చేసి క‌డుపుపై ఉంచి క‌ట్టుగా క‌ట్ట‌డం వ‌ల్ల క‌డుపులోఉన్న నులి పురుగులు న‌శిస్తాయి. అంతే కాకుండా సుఖ విరేచ‌నం కూడా అవుతుంది. ప‌చ్చి గాడిద‌గ‌డ‌పాకును ఆముదంతో క‌లిపి నూరి చ‌ర్మం పై పూత‌గా రాయ‌డం వ‌ల్ల పిల్లల‌కు అయ్యే క‌ర్పాని కురుపులు తగ్గుతాయి. ఈ మిశ్ర‌మాన్ని ఉప‌యోగించి పెద్ద‌ల‌లో వ‌చ్చే గజ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధుల‌ను కూడా న‌యం చేసుకోవ‌చ్చు. పురుగులు ప‌ట్టిన వ్ర‌ణాల‌ను న‌యం చేయడంలో కూడా గాడిద‌గ‌డ‌పాకు మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. గాడిద‌గ‌డ‌పాకు ప‌చ్చి మొక్క‌ను తీసుకుని దంచి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని వ్రణాల‌పై పోసి ఆ ముద్ద‌ను వ్ర‌ణాల‌పై ఉంచి క‌ట్టుగా క‌ట్టాలి. రోజుకు ఒక‌సారి క‌ట్టును విప్పి వ్రణాన్నిశుభ్రం చేసి మ‌ర‌లా కొత్త ఆకును ఉంచి క‌ట్టు క‌ట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వ్ర‌ణాలు త‌గ్గుతాయి.

we see Gadida Gadapaku every where know its health benefits
Gadida Gadapaku

ఈ మొక్క ఆకుల‌ను 100 గ్రా.ల మోతాదులో తీసుకుని వంట ఆముదంతో వేయించి పశువుల‌కు తినిపించ‌డం వ‌ల్ల ప‌శువుల‌ల్లో వ‌చ్చే క‌డుపునొప్పి, వాత రోగాలు తగ్గుతాయి. గ‌ర్భం ధ‌రించిన ప‌శువుల‌కు మాత్రం దీనిని తినిపించ‌కూడ‌దు. గాడిద‌గ‌డ‌పాకు ఆకులు 5, మిరియాలను 11 చొప్పున తీసుకుని మెత్త‌గా నూరి చిన్న మాత్ర‌లుగా చేసి నీడ‌కు ఎండ‌బెట్టాలి. రోజుకు ఒక మాత్ర చొప్పున రాత్రి పడుకునే ముందు మంచి నీటితో క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న నులిపురుగులు, నార పాములు అన్నీ విరేచ‌నం ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. ఒక మ‌ట్టి కుండ‌లో గాడిద‌గ‌డ‌పాకు ఆకుల‌ను వేసి పైన ఉప్పును చ‌ల్లి మూత పెట్టి కుండ కింద మంట పెట్టాలి. ఉప్పు చిట‌ప‌ట త‌గ్గే వ‌ర‌కు ఉంచి కుండ‌ను దించి లోప‌ల ఉన్న ఆకుల‌ను ఉప్పుతో క‌లిపి మెత్త‌గా నూరాలి. దీనిని 5 గ్రా. ల మోతాదులో తీసుకుని ఒక క‌ప్పు వేడి నీటిలో క‌లిపి తాగ‌డం వ‌ల్ల రుతుశూల త‌గ్గుతుంది.

గాడిద‌గ‌డ‌పాకు ఆకు ర‌సాన్ని 10 గ్రా.ల మోతాదులో తీసుకుని దానికి స‌మ‌పాళ్ల‌లో ఆముదాన్ని క‌లిపి తాగిస్తే సుఖ ప్ర‌స‌వం అవుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పాము కాటుకు గురి అయిన వెంట‌నే ఈ మొక్క ర‌సాన్ని పాము కాటు పై పోసి గుడ్డ పొగ వేయాలి. వెంట‌నే ప‌ది గ్రాముల గాడిద‌గ‌డ‌పాకు ర‌సానికి 2 గ్రాముల మిరియాల పొడిని క‌లిపి తాగించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పాము విషం హరించుకు పోతుంది. గాడిద‌గ‌డ‌పాకు 20 గ్రా., వ‌ర్ణ‌వాలు 10 గ్రా., రాతి సున్నం 3 గ్రా. ల మోతాదులో తీసుకుని నూరి వెన్నుపై ప‌ట్టు వేస్తే చ‌లి జ్వ‌రం తగ్గుతుంది. మూర్ఛ వ‌చ్చిన వెంట‌నే గాడిద‌గ‌డ‌పాకు ఆకుల‌ను న‌లిపి ర‌సాన్ని తీసి ఆ ర‌సాన్ని మూడు చుక్క‌ల చొప్పున ముక్కులో వేస్తే మూర్ఛ త‌గ్గుతుంది. ఈ విధంగా గాడిద‌గ‌డ‌పాకును ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts