నందమూరి తారక రామారావు… రెండవ భార్యనే లక్ష్మీపార్వతి. ఈమె ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నారు. లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకునే ముందే వేరొకరికి భార్య. ఆమె మొదటి భర్త పేరు వీరగ్రంధం వెంకట సుబ్బారావు. ఆయన హరి కథ చెప్పడంలో ప్రసిద్ధుడు. ఖండాలు దాటి హరి కథ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చాడు.
అయితే వీర గ్రంధంకు కూడా లక్ష్మీ పార్వతి రెండో భార్యనే కావడం విశేషం. ఆయన మొదటి భార్య బిడ్డ పుట్టిన వెంటనే మరణించడంతో పెద్దలు లక్ష్మీపార్వతితో వివాహం జరిపించారు. లక్ష్మీపార్వతి సంస్కృతంలో డిగ్రీ చేసింది. పెళ్లయిన తర్వాత లక్ష్మీపార్వతి చదువుతానంటే…ఆమె భర్త నాగార్జున యూనివర్సిటీ లో చేర్పించారు. అంతేకాకుండా ఒక కళాకారుడు రాజకీయాల్లోకి వస్తే సీఎం అయితే కల బ్రతుకుతుంది అని భావించిన సుబ్బారావు టీడీపీలో చేరి ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేయడం మొదలుపెట్టారు.
ఇక సుబ్బారావు ఓ సందర్భంలో తన భార్య లక్ష్మీపార్వతి తో కలిసి అమెరికాకు వెళ్లి హరికథ చెప్పారు. ఈ విషయం ఎన్టీఆర్‌కు తెలిసి వారిద్దరిని పిలిపించుకొని అభినందించారు. అంతేకాకుండా సుబ్బారావు కళాకారుల కోసం వీరగ్రంధం కళాక్షేత్రం అనే సంస్థను స్థాపించాడు. దాని కోసం ఎన్టీఆర్ కొంత భూమి ఇవ్వగా… ఆ భూమిని లక్ష్మీపార్వతి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ ఎన్టీఆర్ మరణానంతరం.. ఈ భూమి విషయం పై కొంతకాలం వారి మధ్య గొడవలు కూడా జరిగాయి.