politics

పాక్ ప్ర‌స్తుతం బ‌ల‌హీనంగా ఉంది క‌దా..? ఆ దేశంపై భార‌త్ దాడి చేసి దాన్ని ఆక్ర‌మించుకోవ‌చ్చు క‌దా..?

Rafale యుద్దవిమానం చూడండి. Meteor missile ఒక్కటి – 25 కోట్ల రూపాయలు. MICA missile ఒక్కటి – 22 కోట్ల రూపాయలు. SCALP missile ఒక్కటి – 24 కోట్ల రూపాయలు. ఒకసారి 14 వివిధ రకాల మిస్సైల్స్ ni అది మోసుకువెళ్తుంది. వాటిని యదేచ్చగా వాడాలి. కర్చు ఎంత అవుతుంది? భారత్ దగ్గర ఉన్న T72 యుద్ద టాంక్ 1km కదలాలి అంటే 3 లీటర్ల ఇంధనం కావాలి. మనకి 4600 పైగా యుద్ద టాంక్ లు ఉన్నాయి. అందులో సింహభాగం పాక్ పైన యుద్ధం లో వినియోగిస్తే అయ్యే ఖర్చు.. చాలా ఎక్కువ‌గా ఉంటుంది. Mig29 యుద్ద విమానం ఒక గంట ఎగరాలి అంటే 16 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఇంచుమించు 700 యుద్దవిమానాలు, అందులో SU 30 లాంటివి ఇంకా పెద్దవి, సింహభాగం action లో ఉండాలి. ఎంత ఖర్చు అవుతుంది ఊహించండి !

భారత్ బలం పెరిగింది అన్న మాట వాస్తవం కానీ ఆ బలం మన అంతర్గత సమస్యలని పరిష్కరించుకోవడానికి వినియోగించాలి. పైపెచ్చు, పాకిస్తాన్‌ని ఆక్ర‌మించుకునేంతగా పెరగలేదు. మనం పాక్ ni conventional యుద్ధంలో ఎప్పుడైనా ఓడించగలం కానీ అక్రమించుకోవడం సాధ్యం కాదు. ఇతర దేశాన్ని అక్రమించుకోవాలి అంటే ఇంకా అనేకరెట్లు ఆర్థిక, సైనిక , ఇతర వనరుల వ్యయం అవుతుంది. ఆ స్థాయి మనకి లేదు. అనిశ్చితి ఉన్నప్పుడు ఇతర దేశాలు మనదగ్గర పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడవు.

pakistan is weak now india can occupy it

మన ఆదాయం సింహభాగం ఎక్కడినుంచి వస్తుందో గమ‌నించాలి. దేశీయంగా తయారీ రంగం వగైరా ఆశించిన స్థాయిలో లాభదాయ‌కంగా లేవు. అణ్వాయుధాలు కలిగిన దేశం, మనం చైనా ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పాకిస్తాన్ ను మనం ఆక్రమించుకునే క్రమంలో వనరులు అన్నీ అక్కడ పెడితే చైనా అది అదునుగా తీసుకుంటే..? Final గా, ఇంతా ఆక్రమించుకుని మనకు ఒరిగే లాభం లేదు. కుళ్లిపోయిన భావజాలంతో కూడిన వ్యవస్థ మన నెత్తిమీద పడుతుంది. వాళ్ళకి వాళ్ళు కలుపుకోమన్నా మనం అది చేయకపోవడమే మేలు.

Admin

Recent Posts