lifestyle

దుబాయ్‌కి 10 రోజుల ట్రిప్‌కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? ఏమేం చూడొచ్చు?

పర్యాటకులను ఆకర్షించటానికి ఎన్నో ఉండేలా దుబాయ్ చాలా జాగ్రత్తలు పడింది. ఇక్కడకు వస్తే 90 రోజుల్లో సగానికి పైగా విశేషాలు చూసేయొచ్చు. బుర్జ్ ఖలీఫా, మిరాకిల్ గార్డెన్స్, బటర్ ఫ్లయ్ గార్డెన్స్, అయిన్ దుబాయ్, దుబాయ్ గేట్, మోషన్ గేట్, డిసర్ట్ సఫారీ, పామ్ జుమేరా, దుబాయ్ అక్వేరియం, అండర్ వాఁటర్ జూ, దుబాయ్ ఫౌంటైన్, దుబాయ్ మాల్, బుర్జ్ అల్ అరబ్, ఐ ఎం జి వరల్డ్ ఆఫ్ అడ్వెంచర్, దుబాయ్ ఫ్రెమ్, గ్లోబల్ విలేజ్, స్కి దుబాయ్, దుబాయ్ గార్డెన్ గ్లో, అట్లాంటిస్ పామ్, ద లాస్ట్ చాంబర్ అక్వేరియం, ఫెరారీ వరల్డ్, బాలీవుడ్ పార్క్స్, వర్చువల్ రియాలిటీ పార్క్, దుబాయ్ క్రీక్, వైల్డ్ వాదీ వాటర్ పార్క్, జుమేరా బీచ్ వంటి ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నాయి.

లెగో ల్యాండ్, యస్ ఐలాండ్, లగూనా వాటర్ పార్క్, ఆక్వా వెంచర్ వాటర్ పార్క్, గ్రీన్ ప్లానెట్, డ్రీమ్ లాండ్ ఆక్వాపార్కు, మ్యూజియం ఆఫ్ ఇల్లూషన్స్, దుబాయ్ ఓప్ర, గోల్డ్ సూక్, మాల్ ఆఫ్ ఎమిరేట్స్, కైట్ బీచ్, పోలో క్లబ్, ఆరా స్కయ్ పూల్, ఓల్డ్ దుబాయ్, సయీద్ అల్ మక్తుమ్ హౌస్, సఫారీ పార్క్, దుబాయ్ మ్యూజియం, స్కై వ్యూ, దుబాయ్ స్పైస్ సూక్, ఇత్తిహాద్ మ్యూజియం, హెరిటేజ్ విలేజ్, చిల్డ్రెన్స్ సిటీ, ఇబ్న్ బతుత మాల్, దుబాయ్ ఆటో డ్రోమ్, అల్ కుద్రా లవ్ లేక్, మంజర్ బీచ్, ఖుర్ఫాకాన్ బీచ్, హత్త హెరిటేజ్ విలేజ్, … ఇక లిస్ట్ కి అంతం కనిపించదు.

how much it costs for us to go to dubai

ఒక్కో దాని గురించి చెబితే సమాధానం కాకుండా ఒక గ్రంధం అవుతుంది. ఒక ఫ్యామిలీ, భార్యాభర్తలు వారిద్దరి 12 సంవత్సరాల లోపు పిల్లలు అనే లెక్కలో – వీసాకి – పెద్దవారికి 400, చిన్నపిల్లలకు ఫ్రీ. ప్రాసెసింగ్ ఫీ 250. అంటే వీసా కి 1300 దిర్హంస్ అవుతాయి. టికెట్ కి- రావటానికి, తిరిగి వెళ్ళటానికి దాదాపు 5000 నుండి 6000 దిర్హంస్ అవుతాయి. హోటల్- రోజుకి 300 సగటున వేసుకుంటే 3000 దిర్హంస్. ఇందులో ఎన్నో అప్షన్స్ ఉన్నాయి. అడ్జస్ట్ అవగలిగితే రోజుకి 150 వి కూడా ఉన్నాయి. ఇక ఫుడ్, ఒక మనిషికి రోజుకి సగటున 40 దిర్హంస్ వేసుకుంటే.. రోజుకు (అందరికీ కలిపి) 150 దిర్హంస్ ఫుడ్ కి అవుతాయి. ఇండియన్ ఫుడ్ ఆయా విజిటింగ్ ప్లేసుల్లో దొరకదు గానీ సిటీలో చాలా చోట్ల దొరుకుతుంది.

అయితే ఇక్కడకు వెజిటేరియన్స్ వస్తే ఏడుపు మొఖం పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నాన్ వెజ్ రుచులు ఇక్కడ దొరికినట్టు ఇంకెక్కడా దొరకవు. లెక్క వేసే కెపాసిటీ ఉంటే 1500 కి పైచిలుకు నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇక ట్రాన్స్పోర్ట్.. టాక్సీలు ఈజీగా దొరుకుతాయి కానీ ఖర్చు ఎక్కువ. బస్సులు మెట్రోలు ఉన్నాయి. NOL కార్డ్ తీసుకుంటే బస్సులకు, మెట్రోలకే గాక, పార్కుల్లో ఎంట్రీ టికెట్స్ కి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ లోకల్లో సిటీ టూర్ బస్సులున్నాయి. 130 దిర్హంస్ లో కొన్ని ప్రముఖ పర్యాటక స్థలాలను తక్కువ ధరకు చూసేయొచ్చు. అయితే ఈ ఖర్చులు తగ్గించుకునే కొన్ని ఉపాయాలూ ఉన్నాయి. కొంచెం తెలివిగా ప్లాన్ చేసుకుంటే ఖర్చు బాగా తగ్గుతుంది.

ఇక్కడ సినిమా హాళ్లు ఉన్నాయి కానీ అవి దాదాపు ఖాళీగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవటం చాలా తక్కువ. అయితే ఇంతకు ముందు ఒక సమాధానంలో చెప్పినట్టు, మరొకరిని డిస్టర్బ్ చేసే పనులు మాత్రం చేయకూడదు. సెలెబ్రెటీలు ఇక్కడ తరచుగా కనిపిస్తూ ఉంటారు. పట్టించుకోకూడదు. మనుషుల్ని ఫోటోలు తీయకూడదు. తీయాలంటే ఆయా వ్యక్తుల పర్మిషన్ లేకుండా తీసుకోకూడదు. ఆడవారైనా, మగవారైనా.

Admin

Recent Posts