Food : సాధారణంగానే మనం కొన్ని సార్లు ఆహార పదార్థాలను కింద పడేస్తుంటాం. అనుకోకుండానే అవి కింద పడిపోతుంటాయి. ఇలాంటి స్థితిలో కొందరు వాటిని తిరిగి తీసుకుని తింటుంటారు. కొందరు పోతేపోనీలే.. అని విడిచిపెట్టి వెళ్తుంటారు. అయితే ఇదే విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారు ? అసలు నేలపై పడిన ఆహారాలను తినవచ్చా ? తింటే ఏం జరుగుతుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నేలపై పడిన ఆహారాలను తినేందుకు నిపుణులు కొన్ని సూచనలు చెప్పారు. అవేమిటంటే.. మన ఇంట్లో అయితే నేల శుభ్రంగా ఉంటుంది కనుక దానిపై ఆహారాలు పడినా.. 5 సెకన్ల లోపు.. అంటే వెంటనే తీసి తినవచ్చన్నమాట. 5 సెకన్లలోపు ఆహారం నేలపై ఉంటే దాని మీదకు సూక్ష్మజీవులు చేరవని చెబుతున్నారు. కనుక ఇంట్లో నేలపై పడ్డ ఆహారాన్ని 5 సెకన్లలోపు అయితే తీసి తినవచ్చు. కానీ ద్రవాహారానికి ఇది వర్తించదు. ద్రవాలను తీయలేము, కనుక వాటిని అలాగే వదిలేయాలి. శుభ్రం చేసేయాలి.
ఇక బయటి వాతావరణంలో నేల చాలా కలుషితంగా ఉంటుంది. సూక్ష్మ క్రిములు బాగా ఉంటాయి. అలాంటి వాతావరణంలో ఉన్న నేలపై ఆహారం పడితే దానిపై వెంటనే సూక్ష్మ జీవులు చేరుతాయి. ఆహారం పడిన 1 సెకన్ లోనే సూక్ష్మ జీవులు దానిపై చేరిపోతాయి. కనుక అలాంటి ఆహారాన్ని తినరాదు.
బయటి వాతావరణంలో నేలపై ఏ ఆహారం పడినా సరే తీసి తినరాదు. కానీ ఇంట్లో నేల శుభ్రంగా ఉంటుంది కనుక దానిపై ఆహారం పడితే 5 సెకన్లలోపు తీసి తినవచ్చు. కానీ తినేముందు ఒక్కసారి చూసుకుని తినడం మంచిది. అయితే ఈ సూత్రం అన్ని సందర్భాల్లోనూ వర్తించదని నిపుణులు అంటున్నారు. ఇంట్లోనూ శుభ్రమైన నేల (ఫ్లోర్) లేకపోతే అలాంటి దానిపై పడిన ఆహారాలను తినొద్దని చెబుతున్నారు.