Heart Problems Test : ప్రస్తుత తరుణంలో గుండె పోటు అనేది సహజంగా మారింది. ఒకప్పుడు వయస్సు మీద పడిన వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. కానీ 30-40 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి కూడా గుండె పోటు వస్తోంది. ఇది ఆందోళనకు గురిచేసే విషయమని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎవరైనా సరే కింద చెప్పిన విధంగా ఈ టెస్టులను ఎవరికి వారు చేసుకుని వారు తమకు గుండె పోటు వస్తుందో, రాదో సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
టెస్టు: 1
ఏదైనా ఒక చేతి వేళ్లను గట్టిగా మూసి పిడికిలి బిగించండి. ఇలా 30 సెకన్ల పాటు ఉండండి. తరువాత అరచేయి మొత్తం రక్త సరఫరా తగ్గి తెల్లగా మారుతుంది. మళ్లీ రక్తం చేయిలోకి సరఫరా అయి ఎరుపు రంగులోకి మారుతుంది. అయితే ఇలా మారేందుకు ఎంత సమయం తీసుకుంటుందో పరిశీలించింది. సాధారణంగా అయితే వెంటనే ఎరుపు రంగులోకి మారుతుంది. కానీ గుండె జబ్బులు ఉన్నవారిలో రక్త సరఫరా సరిగ్గా ఉండదు కనుక చేయి ఎరుపు రంగులోకి మారేందుకు కొంత సమయం పడుతుంది. కనుక అలా సమయం పడితే వెంటనే అప్రమత్తం కావాలి. వైద్యుడిని కలిసి గుండె పరీక్షలు చేయించుకోవాలి. ఏమైనా తేడా ఉంటే వెంటనే డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
టెస్టు: 2
ఏవైనా రెండు చేతి వేళ్లను తీసుకుని గట్టిగా అదిమిపట్టండి. 5 సెకన్ల పాటు ఉన్నాక వదిలేయండి. తరువాత రక్త సరఫరాను గమనించండి. తెల్లగా ఉన్న వేళ్లు ఎరుపు రంగులోకి ఎంత సేపట్లో మారుతున్నాయో పరిశీలించండి. ఆలస్యం అయితే కచ్చితంగా మీకు గుండె సమస్య ఉన్నట్లే లెక్క. ఇక శ్వాస సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు ఉన్నవారిలోనూ ఇలాగే జరుగుతుంది. కనుక ఆయా పరీక్షలు కూడా చేయించుకుంటే మంచిది. దీంతో సమస్య ఎక్కడ ఉంది ? అన్నది స్పష్టమవుతుంది. ఈ క్రమంలో సమస్యకు అనుగుణంగా చికిత్స తీసుకుని ప్రాణాపాయం రాకుండా జాగ్రత్త పడవచ్చు.
టెస్టు: 3
నేలపై బోర్లా పడుకోవాలి. ముఖం నేలను చూస్తుండాలి. చేతులను నేల మీదే పైకి చాపాలి. అనంతరం రెండు కాళ్లను పైకి లేపాలి. ఆ భంగిమలో 30 సెకన్ల పాటు ఉండాలి. అలా ఉండగలిగితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. లేదంటే మీ గుండె లేదా జీర్ణాశయం, వెన్నెముకలలో సమస్య ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా వైద్య పరీక్షలు చేయించుకుని సమస్య ఉంటే చికిత్స తీసుకోవాలి.
ఈ విధంగా ఈ 3 రకాల టెస్టులను చేయడం ద్వారా ఎవరైనా సరే తమకు గుండె సమస్యలు ఉన్నాయో లేవో సులభంగా పరీక్షించుకోవచ్చు.