నిద్ర అనేది మనకు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. రోజూ తగినంత సమయం పాటు నిద్రించడం వల్ల మన శరీరానికి కొత్త శక్తి లభిస్తుంది. తిరిగి పనిచేసేందుకు కావల్సినంత శక్తి అందుతుంది. శరీరం పునరుత్తేజం అవుతుంది. నిద్రించే సమయంలో మన శరీరం పలు మరమ్మత్తులు చేసుకుంటుంది. కనుక ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం. అయితే ఎవరు నిద్రించినా కళ్లు మూసుకుంటేనే అది సాధ్యమవుతుంది. కళ్లు తెరచి నిద్రించడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే కొందరు మాత్రం కళ్లు తెరచి కూడా నిద్రిస్తారు. మరి ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషుల్లో చాలా తక్కువ మంది మాత్రమే కళ్లు తెరచి నిద్రిస్తారు. అయితే అది వారికి వచ్చిన అలవాటో లేదంటే ప్రాక్టీస్ వల్లో కాదు. ఓ జబ్బు ఉండడం వల్ల కళ్లు తెరచి నిద్రిస్తారట. అంటే వారు నిద్రించేటప్పుడు మామూలుగానే కళ్లు మూసుకుంటారు. కాకపోతే నిద్రలో కళ్లు తెరుస్తారన్నమాట. కొందరు సగం కళ్ల వరకు తెరచి నిద్రపోతారు. అయితే ఈ రెండు రకాల్లో ఎలా నిద్రపోయినా వారు Nocturnal Lagophthalmos అనే వ్యాధితో బాధపడుతున్నట్టు అర్థం చేసుకోవాలి. లేదంటే stroke కానీ, facial paralysis అనే అనారోగ్య సమస్య ఉన్నాగానీ అలాంటి వారు కళ్లు తెరచి నిద్రపోతారట. అంతే కానీ అందులో వారు స్వతహాగా ప్లే చేసే ట్రిక్ ఏమీ ఉండదట.
అయితే ఎవరూ కూడా కళ్లు తెరచి నిద్రించడానికి యత్నించకూడదట. ఎందుకంటే.. అలా నిద్రించడం మన ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. కళ్లు తెరచి నిద్రిస్తే అప్పుడు మన శరీరంపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందట. దీంతోపాటు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందట. కనుక కళ్లు తెరచి నిద్రించడం మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు. కాబట్టి మీరు సరదాకి కూడా ఆ పనిచేయకండి.