ఆచార్య చాణక్య భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరు. ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే.. అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆచార్య చాణక్య ఒక నీతిలో తల్లిదండ్రులే పిల్లలకు శత్రువులవుతారని చెప్పారు. ఆచార్య చాణక్య ఎందుకు అలా అన్నారో తెలుసా? దీని వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. ఆచార్య చాణక్య ఎలాంటి తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులో చెప్పారో చూడండి… మాతా శత్రుః పితా వైరీ యేన బాలో న పాఠితః। న శోభతే సభామధ్యే హంసమధ్యే బకో యథా।।
అర్థం- ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు చెప్పించరో, వారు పిల్లలకు శత్రువులవుతారు. అలాంటి పిల్లలు పండితుల మధ్యలో హంసల మధ్య కొంగలా ఉంటారు. పిల్లలకు చదువు చాలా అవసరం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువు చెప్పించడానికి ప్రయత్నించాలని చాణక్యుడు అంటారు. ఎందుకంటే చదువు లేకపోతే పిల్లలకు ఆలోచించే శక్తి ఉండదు. వేరే పిల్లలతో సమానంగా ఉండలేరు. అందుకే పిల్లలకు చదువు చాలా ముఖ్యం.
పిల్లలకు నైతిక విద్య నేర్పించాలి. తల్లిదండ్రులు మాత్రమే పిల్లలను మంచి వ్యక్తిగా, దేశానికి మంచి పౌరుడిగా తీర్చిదిద్దగలరు. పిల్లలు పెద్దయ్యాక తమ బాధ్యతలను తెలుసుకుని కుటుంబం కోసం, సమాజం కోసం, దేశం కోసం నిజాయితీగా పనిచేసేలా చూడాలి. అప్పుడే తల్లిదండ్రుల బాధ్యత పూర్తవుతుంది. పిల్లలను ప్రోత్సహించాలి. పిల్లలను మంచి పనులు చేయడానికి ప్రోత్సహించే బాధ్యత కూడా తల్లిదండ్రులదే. పిల్లలు మంచి పని చేసినప్పుడు వారిని మెచ్చుకోవాలి. వేరే విధాలుగా కూడా వారిని ప్రోత్సహించాలి. అలా చేయడం వల్ల పిల్లలు ఆ మంచి పనులను జీవితంలోకి తీసుకుని సమాజంలో, కుటుంబంలో మంచి పేరు తెచ్చుకుంటారు.