Carrots Vs Carrot Juice : క్యారెట్ల‌ను ప‌చ్చిగా తినాలా.. జ్యూస్‌లా తాగాలా.. ఏది బెట‌ర్‌..?

Carrots Vs Carrot Juice : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయల్లో క్యారెట్లు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది నేరుగా ప‌చ్చిగానే తింటుంటారు. ఇవి ఇత‌ర దుంప‌ల మాదిరిగా కాదు. కాస్త తియ్య‌గా ఉంటాయి. క‌నుక వీటిని ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు. ఇక క్యారెట్ల‌తో చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. వీటితో ప‌చ్చ‌డి, పులావ్‌, మ‌సాలా క‌ర్రీ, బిర్యానీ, హ‌ల్వా వంటి వెరైటీ వంట‌కాల‌ను చేసుకోవ‌చ్చు. అయితే క్యారెట్ల‌ను తిన‌డంలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. అదేమిటంటే.. క్యారెట్ల‌ను నేరుగా ప‌చ్చిగానే తింటే మంచిదా.. లేక జ్యూస్ తాగాలా.. అని ఆలోచిస్తుంటారు. అయితే ఇందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ల‌ను జ్యూస్‌లా కాదు. ప‌చ్చిగా నేరుగా అలాగే తింటేనే మంచిద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే క్యారెట్ల‌ను ప‌చ్చిగా తినేందుకు స‌మ‌యం ప‌డుతుంది. నోట్లో బాగా న‌మిలి తింటారు. దీంతో నోట్లో లాలాజ‌లం ఉత్ప‌త్తి అవుతుంది. ఇది పొట్ట‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇది పొట్ట‌లోకి వెళ్ల‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు ఉంటే త‌గ్గుతాయి. అలాగే క్యారెట్ల‌ను తినేందుకు స‌మ‌యం ప‌డుతుంది క‌నుక ముఖానికి చ‌క్క‌ని వ్యాయామం అవుతుంది. క‌నుక క్యారెట్ల‌ను ప‌చ్చిగానే తిన‌డం ఉత్త‌మం.

Carrots Vs Carrot Juice which one is better to take
Carrots Vs Carrot Juice

అయితే కొంద‌రు క్యారెట్ల‌ను ఉద‌యం తింటుంటారు. ఆ స‌మ‌యంలో ఆఫీసుల‌కు, బ‌య‌ట‌కు ప‌నికి వెళ్తారు. క‌నుక ఉద‌యం స‌మ‌యంలో క్యారెట్ల‌ను తింటామ‌నుకుంటే.. స‌మ‌యం ఉండ‌దు క‌నుక‌.. అలాంట‌ప్పుడు జ్యూస్ తాగితేనే బెట‌ర్‌. ఎందుకంటే స‌మ‌యం ఆదా అవుతుంది. స‌మ‌యం ఉంది తింటామ‌నుకునేవారు నేరుగా అలాగే ప‌చ్చిగానే తినేయాలి. టైమ్ లేద‌ని భావిస్తే జ్యూస్ తాగాలి. ఇలా క్యారెట్ల‌ను ఎవ‌రికి వారు త‌మ సౌక‌ర్యానికి అనుగుణంగా తీసుకోవ‌చ్చు. కానీ ఎలా తీసుకున్నా స‌రే క్యారెట్ల వ‌ల్ల మ‌న‌కు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. వీటితో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts