ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కోవిడ్ మూడో వేవ్ ప్రారంభమైంది. అనేక దేశాల్లో కరోనా డెల్టా వేరియెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య పెరిగింది. అయితే కోవిడ్ నుంచి రక్షణగా ఉండవచ్చని టీకాలను తీసుకుంటున్నప్పటికీ చాలా మందికి రెండు డోసుల టీకా వేసుకున్నాక కూడా కోవిడ్ సోకుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది ? దీనిపై నిపుణులు ఏమంటున్నారు ? అంటే..
ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఏవీ 100 శాతం రక్షణను ఇవ్వవు. 60 నుంచి 90 శాతం మధ్యలో అవి ప్రభావవంతంగా పనిచేస్తాయని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. అంటే.. వ్యాక్సిన్లు రెండు డోసులు వేసుకున్నప్పటికీ 100 శాతం రక్షణ లభిస్తుందని చెప్పలేం. వారిలో అజాగ్రత్తగా ఉంటే ఎవరికైనా సరే కోవిడ్ వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుంది. సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.
చాలా మంది రెండు డోసుల టీకా వేసుకున్నాం కదా.. మాకేమీ కాదులే.. అని చెప్పి మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్నారు. టీకాలు 100 శాతం రక్షణను ఇవ్వవు. కనుక అలాంటి వారికి కోవిడ్ సోకుతోంది. ప్రస్తుతం రెండు డోసుల టీకా తీసుకున్న వారికి కూడా ఇందువల్లే కరోనా వ్యాప్తి చెందుతోంది. అందువల్ల రెండు డోసుల టీకాను తీసుకున్నా సరే ముప్పు పోయిందని అనుకోకూడదు. కచ్చితంగా కోవిడ్ నియమ నిబంధనలను పాటించాల్సిందే.
మరి టీకాలను తీసుకున్నాక అవి ప్రభావం చూపిస్తాయా ? కోవిడ్ నుంచి రక్షణను అందిస్తాయా ? అంటే.. అందుకు నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు. మరలాంటప్పుడు రెండు డోసుల టీకా తరువాత కూడా కరోనా ఎందుకు వ్యాప్తి చెందుతుంది ? అంటే.. అది పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే అని నిపుణులు చెబుతున్నారు. టీకాలు 100 శాతం రక్షణను ఇవ్వవు కనుక ఆ విషయాన్ని మనస్సులో ఉంచుకుని మెలగాలి. కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి. దీంతో కోవిడ్ రాకుండా చూసుకోవచ్చు. ఈ క్రమంలో టీకా నుంచి లభించే రక్షణ లభిస్తుంది. ఈ విధంగా కరోనా రాకుండా జాగ్రత్త పడవచ్చు.
కనుక రెండు డోసుల టీకా తీసుకున్నాం కదా.. అని నిర్లక్ష్యం పనికిరాదు. వారికి కూడా కోవిడ్ సోకుతోంది కనుక జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది.