సోయా చంక్స్.. వీటినే మీల్ మేకర్ అని కూడా పిలుస్తారు. సోయా పిండి నుంచి వీటిని తయారు చేస్తారు. వీటిని నాన్‌వెజ్ వంటల్లా వండుతారు. ఇవి భలే రుచిగా ఉంటాయి. అయితే మీల్ మేకర్స్‌ను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సోయాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీల్ మేకర్లను మాంసానికి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చ. మాంసం తినలేని వారు వీటిని తింటే ప్రోటీన్లు బాగా లభిస్తాయి. శక్తి అందుతుంది. ఉత్సాహంగా పనిచేస్తారు.
2. సోయాలో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. వీటిల్లో కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటాయి.
3. మీల్ మేకర్స్‌ను తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. అధిక బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
4. వీటిని తినడం వల్ల చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫైబర్ ఉంటుంది కనుక జీర్ణ సమస్యలు ఉండవు. సులభంగా జీర్ణమవుతాయి. పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.