అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీ లైఫ్‌ను 15 ఏళ్లు పొడిగించాల‌ని అనుకుంటున్నారా..? ఇలా చేయండి..!

ఆరోగ్యకరమైన జీవితానికి రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు నాలుగు అంచెల ప్రణాళిక అవలంభించాలి. పొగత్రాగటాన్ని, లేదా ఇతర మత్తుపదార్ధాల వాడకాన్ని పూర్తిగా వదలండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అధిక బరువు లేకుండా చూసుకోవడం, ప్రతిరోజు క్రమబద్ధంగా పోషక విలువలుకల ఆహారం తీసుకోవడం చేయాలని ఒక అధ్యయనం తేల్చింది. త్వరగా మృత్యువు దరి చేరకుండా ఉండటానికి ఈ నాలుగు సులభ దశలను పాటిస్తే సరిపోతుందని రీసెర్చర్స్ చెబుతున్నారు. వారు తొలిసారిగా ఈ జీవన విధానంతో సగటు జీవితానికి అదనంగా ఎన్ని సంవత్సరాలు జీవించవచ్చో లెక్కించారు.

ఈ నాలుగంచెల ఆరోగ్య ప్రణాళికద్వారా ప్రత్యేకించి మహిళలు బాగా ప్రయోజనం పొందనున్నారు. వీటిని పాటిస్తే మహిళలు కనీస పక్షం 15 ఏళ్లు అదనంగా జీవిస్తారట. అయితే పురుషులు కూడా ఈ ఆరోగ్య సూత్రాలననుసరించి సుమారు 8.5 సంవత్సరాల వరకూ తమ జీవితాన్ని పొడిగించుకోవచ్చని 25 ఏళ్ల పాటు జరిగిన ఈ సుదీర్ఘ అధ్యయనం తేల్చింది. జీవన విధానం, జీవిత పరిమితి వంటి అంశాలపై క్రమపద్దతిలో ఆహారం తీసుకోవడం చూపే ప్రభావంపై తొలిసారి జరిగిన పరిశోధన ఇదేనని పరిశోధన నిర్వహించిన హాలెండ్స్ మాస్ట్రిచ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎపిడెమియాలజీ ప్రొఫసర్ పియట్ వాన్ డెన్ బ్రాండ్ట్ పేర్కొన్నారు.

here it is how you can increase your life span by 15 years

గత అధ్యయనాలు, ప్రత్యేకమైన పోషకాలు, వాటి ప్రభావాల మీద జరిగినప్పటికీ ఆహారం, జీవన విధానాలను ఒక మొత్తంగా తీసుకోలేదు. స్త్రీ, పురుషుల మరణాలపై జీవన శైలి చూపే ప్రభావం మీద జరిపిన మొట్టమొదటి పరిశోధన కూడా ఇదే. 55 నుంచి 69 ఏళ్ల మధ్యలోని 12,000 మంది స్త్రీ, పురుషుల జీవన విధానం, మరణరేట్లపై ఈ సుదీర్ఘ అధ్యయనం పరిశీలన చేసింది. ప్రారంభంలో అధ్యయనంలో పాల్గొన్నవారి ఆహార సేకరణ, జీవన విధానాన్ని అంచనావేశారు.

Admin

Recent Posts