అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఆ ట్యాబ్లెట్ల‌ను వాడితే క్యాన్స‌ర్ ముప్పు గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ట‌..!

ఆస్పిరిన్ మాత్ర వేసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అని పరిశోధన లో తేలింది. అయితే మరి పరిశోధన లో ఎటువంటి విషయాలు బయట పడ్డాయో ఇప్పుడే చూసేయండి. వారానికి మూడు సార్లు ఈ ఆస్పిరిన్ మాత్ర వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ మరణాల ముప్పు చాలా వరకు తగ్గుతుందని పరిశోధన లో వెల్లడించింది. ఈ మాత్రలోని యాంటీ ఇన్ ఫ్లేమెంటరీ పదార్థాలతో బోవెల్ క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గించగలదని పరిశోధకులు చెబుతున్నారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..? బ్రిటన్ లో ఆస్పిరిన్ మాత్ర తీసుకున్న వారిలో మిలియన్ల మంది గుండె జబ్బుల నుంచి రక్షణ పొందినట్టు కూడా ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ప్రతిరోజూ మిలియన్ల మంది తీసుకునే ఈ పెయిన్ కిల్లర్ ద్వారా గుండె జబ్బుల నుంచి రక్షణ పొందొచ్చని ఇది రక్తాన్ని పలచబడేలా చేస్తుందని అన్నారు. ఇది రక్తాన్ని పలచబడేలా చేస్తుందని తద్వారా రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుందని ఈ అధ్యయనం లో చెప్పడం జరిగింది.

taking aspirin tablets may reduce cancer risk

ఇది ఇలా ఉండగా ప్రాణాంతక క్యాన్సర్లు అయిన బ్రెస్ట్ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ల నుండి కూడా బయట పడవచ్చు అని చెబుతున్నారు పరిశోధకులు. 65ఏళ్ల వయస్సు ఉన్న 140000 మంది పురుషులు మహిళలపై అమెరికాలో దాదాపు 13ఏళ్ల పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రయల్ ద్వారా పరిశీలించి ఈ ఫలితాలను వెల్లడించినట్టు చెప్పారు. అంతే కాదండి బ్రిటన్ ట్రయల్ లో పాల్గొన్న వారికి ఆస్పిరిన్ 75mg డోస్ ఇచ్చారట. ఈ టాబ్లెట్ వేసుకోని వారితో పోలిస్తే తీసుకున్నవారిలో 21శాతం నుంచి 25శాతం వరకు క్యాన్సర్లతో మరణించే ముప్పు తగ్గింది.

Admin

Recent Posts