అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

పాల‌ను రోజూ తాగితే షుగ‌ర్‌ను నియంత్రించ‌వ‌చ్చ‌ట‌..!

ప్రతిరోజూ పాలను తాగటం ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించ వచ్చునని నేషనల్ న్యూట్రీషన్ సంస్ధ నిర్వహించిన సర్వేలో తేలింది. రోజువారీగా పాలను తీసుకుంటే డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌ వ్యాధులు నియంత్రించవచ్చునని నేషనల్ న్యూట్రీషన్ సంస్థ పేర్కొంది. అదేవిధంగా, గోధుమతో తయారైన ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా రక్త హీనతను నియంత్రణ చేయడానికి వీలుంటుందని, హైదరాబాదుకు చెందిన ఒక న్యూట్రీషన్ సంస్థ తన పరిశోధనలో తెలిపింది.

పాలలో డి విటమిన్ లభిస్తుంది. కొవ్వు పదార్ధాలు తక్కువగా కలిగిన పాలను ప్రతిరోజూ తాగడం ద్వారా సూర్యరశ్మి నుండి రక్షణకై వాడే లోషన్‌ లను కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదని, శరీరానికి అవసరమైన విటమిన్ డి పాలను తీసుకోవడంద్వారా లభిస్తుందని ఆ సంస్థనిర్వహించిన సర్వేలో పేర్కొంది.

taking milk daily prevents diabetes

తక్కువ కొవ్వు కల పాల ఉత్పత్తులతో ఎముకల క్షీణత అంటే ఆస్టియోపోరోసిస్ వ్యాధికి కూడా చెక్‌పెట్టవచ్చునట. ఇంకా క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నియంత్రించ వచ్చు. శరీరంలో డి విటమిన్ ను పెంచడం ద్వారా అనేక రకాలైన గుండెసంబంధిత వ్యాధులను సైతం నియంత్రించడం సులువవుతుందని ఈ పరిశోధనలో తేలింది.

Admin

Recent Posts