హెల్త్ టిప్స్

విరేచ‌నాల కార‌ణంగా పొట్ట ఖాళీ అయిందా.. అయితే ఏం తినాలి..?

జీర్ణ వ్యవస్ధ సరిలేకుంటే…ఏం తినాలి? పొట్ట గడబిడ అయి సరి లేకున్నా బాగా తిని తగిన నీరు అందించటం అవసరం. అయితే తీసుకునే ఆహారం తేలికగా వుండి జీర్ణ వ్యవస్ధకు నష్టం కలిగించరాదు. పెరుగు, నీరు, ఆపిల్స్, అరటి పండు డయేరియా చికిత్సకు సహజ మందులే కాక తేలికగా జీర్ణం అయిపోతాయి. పొట్ట సరి లేకున్నా తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు తింటే అవి పొట్టలోని యాసిడ్లను పీల్చి త్వరగా కోలుకునేలా చేస్తాయి.

ఉప్పు తక్కువగా వుండే బిస్కట్లు మంచివే. పాప్ కార్న్, మజ్జిగ కూడా తీసుకోవచ్చు. కాఫీ, టీ, ఆల్కహాల్ మానేయండి. ఆపిల్స్ ఉడికించి చల్లబడిన తర్వాత తొక్క తీసి తింటే అజీర్ణంగా వున్న పొట్టకు త్వరగా స్వస్ధత చేకూరుతుంది. పెరుగు అన్నం తినండి. పొట్ట చల్లపడుతుంది. వేడి అల్లపు రసం పొట్ట గడబిడకు బాగా అరటిపండు గుజ్జులాచేసి, ఆపిల్ తొ కలిపి తింటే తేలికగా జీర్ణం అవుతుంది.

if you have diarrhoea what foods you should eat

లేదా వేడి సూప్ అన్నంలో కలుపుకొని తింటే పొట్ట అజీర్ణం తగ్గుతుంది. పూర్తిగా పొట్ట కోలుకోవాలంటే తేలికైన ఆహారం తీసుకుంటూ 24 గంటలపాటు నీరు తాగుతూంటే స్వస్ధత చేకూరుతుంది. నీరు బాగా తాగకపోయినా, తరచుగా కొద్ది కొద్దిగా తాగినా అది డీహైడ్రేషన్ నుండి తప్పిస్తుంది. శరీరానికి విశ్రాంతి అవసరం.

Admin

Recent Posts