అల్పాహారం సేవించడంతో శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిని క్రమబద్దీకరించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతోపాటు ఆకలికి సంబంధించిన హార్మోన్లకు సహాయకారిగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అల్పాహారాన్ని సాధారణమైన హై కార్బోహైడ్రేట్ భోజనంలాంటి బ్రెడ్ తదితర వాటితో పూర్తి చేయవచ్చు. ఈ కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తినిస్తాయని, దీంతో శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయి నిలకడగా ఉంటుందని తమ పరిశోధనల్లో తేలినట్లు టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన పోషణ విభాగపు ప్రొఫెసర్, పరిశోధకులు డాక్టర్. సిరిల్ కండాల్ తెలిపారు.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడమే మధుమేహం నుంచి బయటపడేందుకు మార్గమని, దీనిని నియంత్రించాలనుకుంటే అల్పాహారం ఉత్తమమైన మార్గమని ఆయన అన్నారు. అల్పాహారం సేవిస్తే మధుమేహానికి సంబంధించిన బాధలు తొలగిపోతాయన్నారు. అల్పాహారంలోనున్న మోనో-సాచురేటెడ్ ఫ్యాట్ శరీరంలోని వ్యర్థపు కొవ్వు స్థాయిని నియంత్రించడంతోపాటు శరీరానికి ఉపయోగపడే కొవ్వును పెంచుతుంది. ఇది గుండెను కాపాడటంలో చాలా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
కార్బోహైడ్రేట్లున్న భోజనంతోపాటు అల్పాహారం సేవిస్తుంటే బ్లడ్ షుగర్ స్థాయిలో మార్పుంటుంది. క్రమం తప్పకుండా అల్పాహారం సేవిస్తుంటే శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయి త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ కేవలం అల్పాహారం మాత్రమే సేవిస్తే శరీరంలో బ్లడ్ గ్రూకోజ్‌లో తక్కువ స్థాయిలో పెరుగుతుందని కండాల్ వివరించారు.