అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

టమోటో జ్యూస్‌తో ఎముకల బలాన్ని పెంచుకోండి..!!

పాలు తాగడం ద్వారా ఎముకలు బలపడతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎముకల్లో బలాన్ని పెంచడానికి టొమాటో రసం కూడా బాగా ఉపయోగపడుతుందని కెనెడియన్ తాజా అధ్యయనంలో తేలింది. టొమాటోల్లో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎముకలు బలపడతాయని తెలిసింది. రుతుక్రమం ఆగిపోయిన కొందరు మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో టొమాటో రసం వల్ల ఎముకలు బలపడతాయని నిరూపితమైంది.

అయితే తాజా టొమాటో జ్యూస్ వల్లే ఈ ఫలితం ఉంటుందని, దాన్ని సాస్, కెచప్ రూపంలో నిల్వ ఉంచడం వల్ల లైకోపిన్ తగ్గుతుందని తేలింది. ఈ లైకోపిన్ అన్నది ఎర్ర రంగులో ఉండే క్యారట్, పసుపుపచ్చరంగులో ఉండే బొప్పాయి, పింక్ రంగులో ఉండే ద్రాక్షపళ్లలోనూ ఉంటాయని నిరూపితమైంది. ఇకపై ఎముకల బలానికి టొమాటో జ్యూస్‌నూ తీసుకోవచ్చు.

you must take tomato juice daily for bones health

ఒకవేళ టొమాటోను జ్యూస్‌గా తీసుకోవడం ఇష్టం లేకపోతే… రుచికరంగా ఉండే క్యారట్, బొప్పాయి, ద్రాక్షలనూ ట్రై చేయవచ్చు. కానీ వాటన్నింటిలో కంటే టొమాటో జ్యూస్‌లో లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది.

Admin

Recent Posts