Vastu Tips : సాధారణంగా మనం ఇంటిని నిర్మించే సమయంలో వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తాం. ఇలా వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటిని నిర్మించడం వల్ల ఏ విధమైనటువంటి వాస్తు దోషాలు లేకుండా ఎంతో సుఖంగా, ప్రశాంతంగా జీవించవచ్చని భావిస్తారు.
అయితే కొన్నిసార్లు వాస్తు లోపం కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాస్తు దోషమున్నవారు తిరిగి ఇంటిని నిర్మించాలంటే కష్టం కనుక అందుకు తగ్గ పరిహారాలు చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి వాస్తు దోషాలతో బాధపడేవారు ఇంట్లో అరోవానా చేప విగ్రహం ఉంటే ఏ విధమైనటువంటి వాస్తు దోషాలు అయినా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
అరోవానా చేప విగ్రహం దుష్టశక్తులను తొలగించి ఇంటిలో మొత్తం అనుకూల వాతావరణ పరిస్థితులను ఏర్పడేలా చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే చాలామంది తమ ఇంటిలో ఆక్వేరియంలో అరోవానా చేపలను పెంచుతుంటారు. అయితే ఇలాంటి చేపలను ఎక్కువ రోజులు ఇంటిలో పెంచలేక పోయినవారు అరోవానా చేప విగ్రహాన్ని ఇంటికి తెచ్చి పెట్టుకోవడం ఎంతో మంచిది.
అయితే ఈ చేప విగ్రహాన్ని తెచ్చుకునే సమయంలో చేప నోటిలో నాణెం తప్పనిసరిగా ఉంచాలి. ఈ విధమైన చేప విగ్రహాన్ని తెచ్చుకోవటం వల్ల అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి. ఇక ఇలాంటి విగ్రహాన్ని మన ఇంట్లో ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచడం ఎంతో ఉత్తమం. ఈ చేప చేసే మరొక మేలు ఏంటనే విషయానికి వస్తే.. భూకంపాలను తొందరగా పసిగడతాయని పండితులు తెలియజేస్తున్నారు. కనుక ఈ చేపలను లేదా వాటి విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు.