sports

కోహ్లి తాగే ఈ నీళ్ల ఖ‌రీదు ఎంతో తెలుసా ? వీటితో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే ?

విరాట్ కోహ్లీ టీమిండియా వీరుడు. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగాడు. చాలా చిన్న స్థాయి జీవితం నుంచి మొదలుపెట్టి ఈ రోజున భారతదేశంలోనే నెంబర్ వన్ క్రికెటర్ గా ఎదిగాడు. తన తండ్రి మరణించిన రోజే ఆటపై ఎంత ప్రేమ ఉందో చూపించాడు. దేశానికి సేవ చేయాలనుకున్నాడు. ఆరోజు ఆడిన ఒక్క మ్యాచ్ తో తన యొక్క నిబద్ధత, గొప్పతనం ఉన్నత స్థాయికి వెళ్లాలనే తపన, తండ్రికి చివరి కోరిక తీర్చడం చేసినటువంటి వ్యక్తి మన పరుగుల వీరుడు.

చిన్నప్పటినుంచి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని అన్నిటినీ అధిగమించి ఈ రోజున కింగ్ కోహ్లీ అనే స్థాయికి ఎదిగాడు. అలాగే, టీమ్ ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కూడా ఫిట్నెస్ కి అత్యంత ప్రాధాన్యమిస్తారు అన్న విషయం తెలిసిందే. ఆయన చేసే వర్కౌట్ వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటారు విరాట్ కోహ్లీ. ఇక ఆయన డైట్ విషయానికొస్తే ఆచితూచి వ్యవహరిస్తారు. ఇవి కేవలం ఆహారానికే వర్తిస్తాయి అనుకుంటే పొరపాటే, ఆయన మినరల్ వాటర్ కి బదులు బ్లాక్ వాటర్ ని సేవిస్తారట.

do you know about virat kohli drinking water

బ్లాక్ వాటర్ లీటర్ ధర తెలిస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే. ఎందుకంటారా, మినరల్ వాటర్ బాటిల్ లీటర్ రూ. 20-40 ఉంటే, బ్లాక్ వాటర్ లీటర్ ధర రూ. 3000-4000 ఉంటుందట. ఇది ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుంది. కరోనా ప్రారంభం నుంచి బ్లాక్ వాటర్ తాగడం మొదలెట్టాడు కోహ్లీ. కేవలం కోహ్లీ మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా, మలైకా అరోరా, దక్షిణాది తార శృతిహాసన్ ఫిట్ గా ఉండేందుకు ఇదే సేవిస్తున్నారు.

బ్లాక్ వాటర్ లో సహజ సిద్ధమైన ఆల్కలైన్ ఉంటుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేటెడ్, ఫిట్ గా ఉండేలా చేస్తుంది. తద్వారా వ్యాధుల నుంచి దూరం ఉండొచ్చు. ఇందులో ఉండే 70% ఖనిజాలు మీ జీర్ణ ప్రక్రియ, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మనం రోజు తాగే నీరులో pH స్థాయి 7 మాత్రమే ఉంటే బ్లాక్ వాటర్ లో 7 కంటే ఎక్కువ ఉండడం గమనార్హం.

Admin

Recent Posts