sports

IPL గురించి ఎవ‌రూ చెప్పని చీకటి నిజాలు ఇవి.. మీకు తెలుసా..?

ప్ర‌స్తుతం ఐపీఎల్ (IPL) హంగామా జ‌రుగుతుండ‌గా, ఎక్క‌డ చూసిన ఎవ‌రు నోట విన్నా దీని గురించే చ‌ర్చ న‌డుస్తుంది. అయితే ఐపీఎల్‌ 2008లో ప్రారంభం అవ్వగా.. అదే సీజన్‌లో వివాదాలు కూడా మొదలయ్యాయి. స్పీడ్ స్టార్ శ్రీశాంత్‌పై హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. శ్రీశాంత్ మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తరువాత హర్భజన్ సింగ్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి శ్రీశాంత్‌కి క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనతో హర్భజన్ సింగ్ 11 మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యాడు. స్పాట్ ఫిక్సింగ్ విష‌యంలో శ్రీశాంత్, అంకిత్ చ‌వాన్, అజిత్ చండీలా ఇరుక్కున్నారు. శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్ చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై బీసీసీఐ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లపై జీవితకాల నిషేధం విధించారు.

ఇక కోల్‌క‌తా, పంజాబ్ మ్యాచ్ టాస్ స‌మ‌యంలో కూడా గౌతమ్ గంభీర్ టాస్ గెలిచిన కూడా ముర‌ళీ విజ‌య్ విన్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు. అది కూడా పెద్ద వివాదం అయింది. ఇక 2013 సీజన్‌లోనే కోల్‌కతా నైట్ రైడర్స్, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. కోహ్లీ ఔట్ అయి పెవిలియన్‌కు వెళుతుండగా.. అప్పటి కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత ఇద్దరూ వాదించుకోవడం కనిపించింది. ఇతర ఆటగాళ్లు, అంపైర్లు వచ్చి ఇద్దరికీ సర్దిచెప్పారు. ఐపీఎల్ 2012 సీజన్‌లో కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్ వాంఖడే స్టేడియంలోకి ప్రవేశించకుండా నిషేధానికి గురయ్యాడు. గ్రౌండ్స్‌మెన్‌పై దాడి చేసినందుకు ఆయనపై నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని 2015లో ఎత్తివేశారు.

do you know these dark secrets about ipl

మోహిత్ మిశ్రా అనే ఆట‌గాడు స్ట్రింగ్ ఆప‌రేష‌న్‌లో త‌న‌కు బ్లాక్ మనీ 70 ల‌క్ష‌ల వ‌రకు ఇచ్చిన‌ట్టు చెప్పాడు. క్రికెట‌ర్ స్వ‌యంగా ఇలా చెప్డంతో అది హాట్ టాపిక్ అయింది. ఇక రాహుల్ శ‌ర్మ‌, ద‌క్షిణా ఫ్రికా క్రికెట‌ర్ పార్నెల్ రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డారు. అక్క‌డ డ్ర‌గ్స్ తీసుకున్నార‌ని పోలీసులు అన్నారు. 90 రోజుల త‌ర్వాత ఇద్ద‌రు డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్టు నిరూపిత‌మైంది. ఇక చీర్ లీడ‌ర్స్ మాట్లాడుతూ ఐపీఎల్ లో త‌మ ప‌ని చాలా చెడ్డ‌ద‌ని వారు అన్నారు. అస‌భ్య‌క‌ర‌మైన ప‌నులు చేయిస్తార‌ట‌. స్ట్రాట‌జిక్ టైమ్ ఔట్ అనేది యాడ్స్ చూపించి డ‌బ్బు సంపాదించే ప‌నిలో భాగంగా బీసీసీఐ చేస్తుందని అంటున్నారు.

Admin

Recent Posts