వినోదం

Saloni : మ‌ర్యాద రామ‌న్న హీరోయిన్ ఇంత‌లా మారిపోయిందేంటి.. చూపు తిప్పుకోలేరు..!

Saloni : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సునీల్ హీరోగా రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం మ‌ర్యాద రామ‌న్న‌. ఈ సినిమా చిన్న సినిమాగా తెర‌కెక్కి పెద్ద విజ‌యం సాధించింది. ఇందులో క‌థానాయిక‌గా న‌టించింది స‌లోని. రెండు దశాబ్దాలలో ఇండస్ట్రీ కి పరిచయమైనా ఎంతో మంది హీరోయిన్స్ లో అచ్చ తెలుగు అమ్మాయిలాగా అనిపించినా నటీమణులు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆ కొంతమందిలో స‌లోని ఒక‌రు అని చెప్పాలి. చూడ‌డానికి మ‌న పక్కింటి అమ్మాయిలాగా కనిపించే ఈ హీరోయిన్ తెలుగు, హిందీ , తమిళం మరియు కన్నడ భాషలకు కలిపి సుమారుగా 20 సినిమాల్లో నటించింది.

టాలెంట్ ,అందం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇండస్ట్రీ లో సరైన సక్సెస్ లేకుండా ఇబ్బంది పడుతున్న సలోని అశ్విని అప్పుడ‌ప్పుడు త‌న హాట్ నెస్‌ని బ‌య‌ట‌పెడుతూ ఉంటుంది. మోడల్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈ అమ్మాయి హీరోయిన్ పాత్రలతో పాటుగా క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ కూడా చాలానే ఉన్నాయి..ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలలో సూపర్ హిట్ అయ్యినవి కేవలం రెండే.ఒకటి సునీల్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘మర్యాద రామన్న’ సినిమా కాగా మరొకటి కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరో గా నటించిన ‘బుద్దిమంతుడు’ అనే సినిమా. వీటి త‌ర్వాత ప‌లు సినిమాలలో హీరోయిన్‌గా చేసిన కూడా పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయాయి.

saloni latest photos viral on social media

స‌లోని చివరిసారిగా వెండితెర‌పై కనిపించిన చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’.2016 వ సంవత్సరం విడుదలైన ఈ సినిమా తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది.కానీ సోషల్ మీడియా ద్వారా ఆమె ఎప్పటికీ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఈమె తండ్రి నార్కోటిక్స్ లో అసిస్టెంట్ కమీషనర్ గా పని చేస్తున్నాడు. ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని , విభిన్నమైన పాత్రలు పోషించాలని ఆమె అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. కానీ సలోని మాత్రం సినిమాలు వద్దు అనే అనుకుంటుంది.ఇది ఇలా ఉండగా ఆమెకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇవి చూసిన ప్ర‌తి ఒక్క‌రు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Admin

Recent Posts