vastu

మీ ఇంట్లో త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయా.. అయితే ఇలా చేయండి..

ఇంట్లో చిన్న చిన్న గొడవలు సహజం..కొన్ని సార్లు అనుకొని చికాకులు.. గొడవలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.. అవి పెరిగి కుటుంబాన్ని విచ్చిన్నం చేసేవరకు వెళతాయి.అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంట్లో ఈ పూల మొక్కలను పెంచితే భార్యాభర్తలు జీవితాంతం అన్యోన్యంగా, ప్రేమానురాగాలతో కలకాలం చల్లగా ఉంటారు. అయితే ఇప్పుడు ఇంట్లో ఎటువంటి పూల మొక్కలు పెంచుకోవాలో తెలుసుకుందాం… మల్లె పూలు..ఈ పూలను ఇష్టపడని వారు ఉండరు.. ఈ పూలు భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ అనురాగాలను ఎక్కువగా పెంచుతాయి. భార్య భర్తల ప్రేమానుబంధాలు చిరకాలం దృఢంగా ఉంటాయి. జీవితాంతం సుఖసంతోషాలతో హాయిగా జీవిస్తారు. మల్లె పూల మొక్కను వీలు అయినంత వరకు ఇంట్లో నాటు కోవడం మంచిది..

ఎరుపు రంగు గులాబీలు..ఈ గులాబీని ప్రేమకు చిహ్నంగా చూపిస్తారు..ఈ పూల మొక్కలను నాటితే భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది.ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనివలన ఇంట్లోని వారు సుఖసంతోషాలతో జీవిస్తారు.

if your family has quarrels regularly then do like this

తామర పూలు..ఈ పూలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ పువ్వును ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే భార్య భర్తలు కలకాలం సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో జీవిస్తారు..

బిళ్ళ గన్నేరు..గన్నేరు పువ్వులు తెలుపు, పింక్ రంగులో ఉండే మొక్కలు నాటితే మీ ఇరువురి మధ్య ప్రేమ పెరుగుతుంది. అలాగే ఈ బిళ్ళ గన్నేరు మొక్కలను మీ ఇంటి ముందు ఆవరణలో నాటడం వలన మీకు, మీ కుటుంబానికి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది..ఈ పూల మొక్కలు ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో ఉండటం వల్ల మంచిదని అంటున్నారు..

Admin

Recent Posts