జనవరి 15 అంటే తెలుగు వాళ్లకు టక్కున గుర్తు వచ్చేది సంక్రాంతి పండుగ. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఏది హిట్, ఏది ఫట్ అని చర్చించుకుంటూ ఉంటారు. సంక్రాంతి సినిమాలు ఏటా మారుతుంటాయి కానీ సంక్రాంతికి అసలైన హీరో విరాట్ కోహ్లీ మాత్రం అలాగే ఉంటున్నారు. విరాట్ కోహ్లీకి సంక్రాంతి స్పెషల్ గా మారింది. అది ఎలాగో చూద్దాం, 2017 నుంచి 2023 వరకు జనవరి 15న విరాట్ కోహ్లీ 4 సెంచరీలు చేయడం విశేషం.
2017 లో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో కోహ్లీ 102 బంతుల్లో 122 రన్స్ చేశాడు. 2018 లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ లో జనవరి 15న కోహ్లీ 153 పరుగులు చేశాడు. 2019 జనవరి 15న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 14 రన్స్ చేశాడు. ఇక ఈ ఏడాది అయితే శ్రీలంక పై 110 బంతుల్లో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు.2020, 2021, 2022 సంవత్సరాల్లో కోహ్లీ జనవరి 15న సెంచరీలు చేయలేదు. ఈ మూడేళ్ల కాలంలో కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.
కానీ 2022 జనవరి 15న కోహ్లీ కీలక ప్రకటన చేశాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు అదే రోజున ప్రకటించాడు. అదేవిధంగా జనవరి 15 తో తన అనుబంధాన్ని కోహ్లీ కొనసాగించాడు. అంటే ప్రతి ఏటా సంక్రాంతికి కోహ్లీ అభిమానులకు పూనకాలు ఫుల్ లోడింగ్ అన్నమాట. కోహ్లీ 2023ని సెంచరీ తో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో వన్డే సిరీస్ లో రెండు శతకాలు బాదిన విరాట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అయితే విరాట్ కోహ్లి మాత్రం తన జెర్సీపై 18 నంబర్‌ను ధరిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.