వినోదం

సేమ్ to సేమ్ ప్రభాస్ లాగే ఉన్న ఈ వ్యక్తిని గమనించారా ? ఆ నటుడే… ఎవరో తెలుసా ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా వెండితెరపై అరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని బాహుబలి వంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. బాహుబలి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టడంతో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి.

అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు చూసి హీరో ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోలలో ఉన్న వ్యక్తిని చూసి అసలు ఎవరు? ఈ వ్యక్తి అచ్చం డార్లింగ్ ప్రభాస్ లాగానే ఉన్నారు అంటూ షాక్ అవుతున్నారు. ఇక వైరల్ అవుతున్న ఆ ఫోటోలలో వ్యక్తి పేరు ఆశిష్ కపూర్. బాలీవుడ్ నటుడు అయిన ఆశిష్ పలు సూపర్ హిట్ హిందీ సీరియల్స్ లలో నటించ‌డం జరిగింది.

who is this person just look like prabhas

సీరియల్స్ తో పాటు పలు సినిమాలలో కూడా ఆశిష్ నటించారు. ఇక ఒక సినిమాకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు ఆశిష్. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఆశిష్ కు ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. తన వర్క్ అవుట్ ఫోటోలు, పర్సనల్ ఫోటోలు ఎప్పుడు సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఈ ఫోటోలను చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ కొన్ని యాంగిల్స్ లో ఆయన ప్రభాస్ లా ఉన్నారు అంటూ ఫోటోలు వైరల్ చేస్తున్నారు.

Admin

Recent Posts