టి 20 క్రికెట్ లో ఒక బౌలర్లు పరిగెట్టుకుంటూ వచ్చి ఒక 110 కిలోమీటర్ వేగంతో ఒక స్లో బంతిని వేస్తాడు . బ్యాటింగ్ చేసేవాడు ఒక లెగ్ సైడ్ వైపు సిక్స్ కొడదాము అని అనుకుంటాడు కానీ టైమింగ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల బంతి ఎటో ఆఫ్ సైడ్ కి వెళ్ళిపోతుంది ఫీల్డర్ క్యాచ్ పడతాడు. ఇదంతా చూస్తే స్కూల్ పిల్లలు ఆడే ఆటలో ఉంటుంది . అదే టెస్ట్ క్రికెట్ లో అయితే 130 — 150 వేగంతో బౌలర్లు బంతిని వేస్తారు. స్పిన్, స్ప్రింగ్ , రివర్స్ స్వింగ్ ఇలా ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. ఎక్కడో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దగ్గర వేసిన బంతిని లెగ్ సైడ్ వైపు 6 కొట్టడం చాలా కష్టం. సాధ్యం కాదు.
షేన్ వార్న్ ఒక అవుట్ సైడ్ లెగ్ స్టంప్ వైపు బంతిని వేసి అక్కడి నుంచి స్పిన్ చేసి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వరకు బంతి తిరిగి బ్యాట్ స్మన్ అవుట్ అయ్యాడు. ఇటువంటి అద్భుతమైన దృశ్యాలు మనకి వన్డే కానీ 20- 20 క్రికెట్లో గానే దొరకవు ఎందుకంటే లెగ్ సైడ్ వైపు కొంచెం బంతి వెళ్లిన వైడ్ ఇచ్చేస్తారు కానీ టెస్ట్ క్రికెట్లో అలా కాదు . టెస్ట్ క్రికెట్ లో సహనం చాలా ముఖ్యం కొన్ని కొన్ని సార్లు ఒక బౌలర్ కి వందల బంతులు వేసిన వికెట్ రాదు అలాగే ఒక బ్యాట్స్మెన్ కొన్ని కొన్ని సార్లు 100 కంటే ఎక్కువ బంతులు ఆడిన బౌండరీలు కొట్టలేడు .
50 ఓవర్లు కొంచెం బెటర్ కానీ 20 ఓవర్ల క్రికెట్లో అసలు క్లాస్అనేదే ఉండదు. ఏదో గల్లీ క్రికెట్ ఆడినట్లు ఉంటుంది ఎక్కడో కొట్టాలి అనుకోవడం ఆ బంతి ఇంక ఎక్కడికో పోవడం . ఈ అన్ని కారణాల వల్ల టెస్ట్ క్రికెట్ నే అన్నిటికన్నా గొప్ప ఫార్మేట్ అందుకే టెస్ట్ క్రికెట్ లో ఆడే క్లాస్ వేరు అంటారు అది ఇతర ఫార్మాట్లలో దొరకదు.