technology

సినిమా వాళ్లు తీసే సినిమా రెండున్న‌ర గంట‌ల నిడివి ఉన్నా స్టోరేజ్ మాత్రం 2 జీబీకి మించ‌దు.. ఇది ఎలా సాధ్యం..?

సినిమా వాళ్లు షూట్ చేసే కెమెరాలు చాలా హై రిజల్యూషన్ లో రికార్డు చేస్తాయి. అలాంటి వాటిలో ఒకటి బ్లాక్ మ్యాజిక్ కెమెరా. ఈ కెమెరాతో షూట్ చేసినప్పుడు 30 నిమిషాల రా వీడియోను షూట్ చేయడానికి 500gb హార్డ్ డిస్క్ అవసరమౌతుంది. అంటే వీళ్లు రికార్డు చేసుకునే ఫార్మాట్లు హై రిజల్యూషన్ లో 4k లో ఉంటాయి. తర్వాత ఆ రా… వీడియోలను ఎడిట్ చేసి మనం చూసే ఫార్మాట్లలో కి మార్చి ప్లే చేస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రికార్డు చేసే ఫార్మాట్లు వేరు తర్వాత ఎడిట్ చేసి ప్లే చేసే ఫార్మాట్లు వేరు.రికార్డు చేసిన ఫార్మాట్లలో ఉన్న వీడియో మెమరీ వందల gb లలో ఉంటుంది. ఎక్కువ డీటెయిల్స్ ను కాప్చర్ చేయడానికి ఎక్కువ బిట్ రేట్ ఉన్న రికార్దింగ్ ఫార్మాట్లలో షూట్ చేస్తారు. తర్వాత ఆ వీడియోలను ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లలో ఎడిట్ చేసి ఆ వీడియోను సినిమాగా హాల్లో ప్రదర్శిస్తారు.

సినిమా హాల్ కు తగ్గట్టుగా వీడియో రిజల్యూషన్ ను తగ్గించి తక్కువ మెమొరీ కలిగిన వీడియో ఫార్మాట్లోకి సినిమా మార్చబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ బిట్ రేటును తగ్గిస్తారు. వీడియో రికార్డ్ అయినప్పుడు ఉన్న బిట్ రేట్ ను ఎడిటింగ్లో సగానికి తగ్గిస్తే… అవుట్ ఫుట్ వీడియో మెమొరీ కూడా సగానికి తగ్గిపోతుంది. క్లారిటీ మాత్రం బాగానే ఉంటుంది. అడోబ్ ప్రీమియర్ లాంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ల‌లో ఎక్కువ బిట్ రేట్ తో మంచి క్లారిటీ తో ఉన్న వీడియో మెమరీ ని క్లారిటీ మిస్ అవ్వకుండా తక్కువ మెమోరీ కి తీసుకు రావడానికి 1బిట్ లో వీడియోను ఎక్స్పోర్ట్ (రెండర్) చేసినా క్లారిటీగా ఉంటుంది…ఆ వీడియోను వాట్సాప్ లో కూడా పంపొచ్చు.

why smart phone videos have big file sizes

అలా వందల GB లలో తీయబడిన సినిమాను ఎడిటింగ్ లో బిట్ రేట్ ను తగ్గించి 2GB లోకి తీసుకు వచ్చినా క్లారిటీగానే ఉంటుంది. 2gb లో ఉన్న సినిమా అనేది కంప్యూటర్లలో టి.వి లలో ప్రదర్శించడానికి అనువుగా మార్చబడిన వీడియో ఫార్మేట్. ఇది సాధారణం గా ఎంపీ4 ఫార్మెట్లో 1080p లో ఉంటుంది. 2 gb లో ఉన్న సినిమా… సినిమా హాల్లో ప్రదర్శించడానికి సరిపోదు. ఇక స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే…మనం వీడియోను దీంతోనే రికార్డు చేస్తున్నాం దీంట్లోనే ప్లే చేస్తున్నాం అంటే రికార్డింగ్ ఫార్మాట్… ప్లే ఫార్మాట్ ఒకటే కాబట్టి మెమరీ ఎక్కువగా ఉంటుంది. ఫోన్ తో రికార్డ్ చేసిన వీడియోను ఎడిట్ చేసి తక్కువ రిజల్యూషన్ లోకి మారిస్తే దాని మెమరీ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గించి ఆ వీడియోలను మనం వాట్సాప్ లో పంపుతూ ఉంటాం.

సినిమా కెమెరాల సెన్సార్లు చాలా పెద్దవి…అదే ఫోన్ కు సంబంధించిన కెమెరా సెన్సార్లు చాలా చిన్నవి. వీడియో మెమరీ అనేది రికార్డు చేసినప్పటి నుండి ప్లే చేసే వరకు అంటే ఎక్కువ నుండి తక్కువకు కుదించబడుతూ ఉంటుంది. ఎక్కువ డీటెయిల్స్ ను షూట్ చేయడానికి ఎక్కువ మెమొరీ ని తీసుకునే రికార్డింగ్ ఫార్మాట్లలో షూట్ చేసి మనకు అవసరమైన రీతిలో వాటి మెమొరీ తగ్గించుకొని ప్లే చేసి చూస్తాము. ఇక్కడ ఫార్మాట్ అంటే మన చేతిరాత లాంటివి అనుకోవాలి. బయట అడ్వర్టైజ్మెంట్ల కోసం పెద్ద పెద్ద హోర్డింగ్ల పైన పెద్ద రాతలు రాస్తారు. దానికి ఎక్కువ ప్లేస్ అవసరమవుతుంది ఎక్కువ దూరం కనిపిస్తాయి. దీన్ని రికార్డింగ్ ఫార్మాట్ లాగా అనుకోండి. తక్కువ దూరంలో అదే అడ్వటైజ్మెంట్ ప్రదర్శించాలంటే చిన్న బోర్డు లు చిన్న అక్షరాలు సరిపోతాయి. దీన్ని మనం ప్లే చేస్తున్న వీడియో ఫార్మాట్ల లాగా అనుకోండి. వీడియోలను సాధారణంగా రికార్డ్ చేసే ఫార్మాట్లు Apple ProRes HQ, DNxHD మొదలగునవి. అలాగే మనం కంప్యూటర్ లో గానీ టీవీ లో గాని చూసే ఫార్మేట్ లు MP4, MWV, AVI మొదలగునవి ఉంటాయి.

Admin

Recent Posts