మా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ లో జరిగిన సంఘటన ఇది. అప్పుడు అర్దం కాకపోయినా ఇప్పుడు ఆ పరిస్థితిని తలచుకుని తెలుసుకున్న నీతి ఇది. మా హాస్టల్లో మొత్తం 100 మంది విద్యార్థులు ఉండేవారు. మాకు ప్రతి రోజూ ఉదయం టిఫిన్ గా ఉప్మా పెట్టేవాళ్ళు. మాలో 80 మంది రోజూ ఉప్మా కాకుండా వేరే ఏదైనా టిఫిన్ పెట్టమని అడిగారు. కానీ నాతో పాటు 20 మంది ఉప్మా అయినా ఫరవాలేదు అన్నాం. 80 మంది మాత్రం ఉప్మా కాకుండా వేరే ఏదైనా టిఫిన్ పెట్టమని ఒత్తిడి చేశారు. చేసేదేంలేక మా వార్డెన్ ఏ టిఫిన్ కావాలో తేల్చుకోమని ఓటింగ్ పెట్టాడు.
ఉప్మా అయినా ఫరవాలేదు అని అనుకున్న మా 20 మంది ఉప్మాకే ఓటేశారు. మిగిలిన 80 మంది ఇలా ఓటేశారు. 18 మంది మసాలా దోశ, 16 మంది వడ, 14 మంది చపాతీ కుర్మా, 12 మంది బ్రెడ్ బటర్, 10 మంది నూడుల్స్, 10 మంది ఇడ్లీ సాంబార్ కావాలన్నారు. మెజారిటీ కోరిక మేరకు తరవాతి రోజుల్లో కూడా ఉప్మానే ఉపాహారంగా కొనసాగించారు.
80% మంది విడిపోయి, తమతమ ఇష్టాలకు తగ్గట్లు ప్రవర్తిస్తే, 20% కలిసి ఐక్యమత్యంగా తమ బలాన్ని నిలుపుకున్నారు. దీన్ని రాజకీయాలకు ఆపాదిస్తే.. 80% మంది విడిపోయి తమ ఇష్టాలకు తగ్గటుగా ఓటేస్తే, 20% మంది కలిసి ఎన్నుకున్న నాయకులు మనల్ని పాలిస్తారు.