Ravi Akulu : ఈ ఆకులను ఉపయోగించి మన శరీరంలో వచ్చే అన్నీ రకాల నొప్పులను తగ్గించుకోవచ్చు. అలాగే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అన్నీ రకాల జుట్టు సమస్యల నుండి బయటపడవచ్చు. అదే విదంగా గజ్జి, తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా ఈ ఆకులను ఉపయోగించి మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. మనకు ఎంతగానో మేలు చేసే ఈ ఆకులు ఏంటని ఆలోచిస్తున్నారా అవి మరేంటో కాదు రావి చెట్టు ఆకులు. మన దేశంలో పవిత్ర చెట్టుగా భావించే చెట్లల్లో రావి చెట్టు ఒకటి. ఈ చెట్టు తెలియని వారుండరనే చెప్పవచ్చు. రావి చెట్టు ఆధ్యాత్మికంగా అలాగే ఔషధంగా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ చెట్టు శాస్త్రీయ నామం ఫికస్ రిలిజియోసా. దీనిని హిందీలో పీపల్ అని పిలుస్తారు. రావి చెట్టులో ప్రతి భాగం కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎంతో కాలంగా రావి చెట్టును ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. రావి చెట్టు నుండి వచ్చే గాలి కూడా ఎంతో శ్రేష్టమైనది. రావి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చినా కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. రావి చెట్టు వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రావి చెట్టు లేత ఆకులను పాలల్లో ఉడికించి వడకట్టుకుని తాగితే మెదడు చురుకుగా పని చేస్తుంది. ఈ చెట్టు పండ్లను తినడం వల్ల జీర్ణశక్తి పెరిగి మలబద్దకం సమస్య తగ్గుతుంది. రావి చెట్టు పుల్లలతో దంతాలను శుబ్రం చేసుకోవడం వల్ల దంతాలు గట్టిపడడంతో పాటు దంతాలకు, చిగుళ్లకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. రావి పండ్లను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడికి సమానంగా పటిక బెల్లం కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటూ ఉంటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.
అలాగే రావి చెట్టు వేర్ల దగ్గర ఉండే మట్టిని సేకరించి శుభ్రం చేసుకోవాలి. ఈ మట్టిని జల్లించి నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న మట్టిని స్నానం చేసేటప్పుడు నలుగుగా ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా ముడతలు లేకుండా తయారవుతుంది. రావి చెట్టు నుండి వచ్చే పాలను పాదాలకు రాసుకోవడం వల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి. రావి పాలతో కాటుకను తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల కళ్ల నుండి నీళ్లు కారడం, కంటి వాపులు, కంటి చూపు మందగించడం వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. రెండు కప్పుల ఆవు పాలల్లో ఒక టీ స్పూన్ రావి పండ్ల పొడిని కలిపి చిన్న మంటపై మూడు పొంగులు వచ్చే వరకు మరిగించి గోరు వెచ్చగా అయినత తరువాత తాగాలి. ఇలా క్రమం తప్పకుండా 40 రోజుల పాటు చేయడం వల్ల గుండె బలంగా తయారవుతుంది. ఆస్థమా వ్యాధితో బాధపడే వారు 3 గ్రాముల రావి ఆకుల పొడిని నీటిలో కలిపి రెండు పూటలా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
ఇక డయాబెటిస్ తో బాధపడే వారు నాలుగు రావి ఆకులను పొడిగా చేసి పావు లీటర్ నీటిలో కలిపి వడకట్టుకుని తాగాలి. ఇలా ప్రతిరోజూ తాగడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. పాము కాటుకు గురి అయిన వ్యక్తికి రావి ఆకుల రసాన్ని రెండు లేదా మూడు టీ స్పూన్ల మోతాదులో ఇవ్వడం వల్ల పాము కాటుకు విరుగుడుగా పని చేస్తుంది. ఈ రావి ఆకులను తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిని నేరుగా తినలేని వారు ఈ ఆకులతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. 5 రావి ఆకులను తీసుకుని వాటికి బెల్లాన్ని కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రోజుకు మూడు లేదా నాలుగు సార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. ఈ విధంగా రావి చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.