Banana Tree : అంతులేని ఔషధ సంపద ఉన్న వాటిల్లో అరటి చెట్టు కూడా ఒకటి. అరటి పండ్లను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అరటి పండ్లనే కాకుండా పచ్చి అరటికాయలను, అరటి పువ్వును, అరటి మొవ్వ, అరటి దుంప, అరటి ఊచను కూడా పూర్వకాలంలో కూరగా వండుకుని తినేవారు. ఇలా కూరగా వండుకుని తినడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటారని మన పూర్వీకులు నమ్మేవారు. వీటిలో అనేక రకాల జాతులు ఉన్నాయి. అరటి చెట్టు రసం తీపి, వగరు రుచిని కలిగి ఉండి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. వాతాన్ని పెంచే గుణం అరటి చెట్టుకు ఉంటుంది. పురుషులల్లో వీర్య వృద్దిని పెంచడంలో, మూత్రపిండాలలో రాళ్లను కరిగించడంలో, రక్త పైత్యాన్ని తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
చాలా మంది ఇండ్లల్లో అరటి చెట్టును పెంచుకోవడానికి సందేహిస్తూ ఉంటారు. ఇంట్లో ఒక అరటి చెట్టు ను పెంచుకోవడం ఉత్తమమని, రెండు చెట్లను పెంచుకోవడం మధ్యమమని, మూడు చెట్లను పెంచుకోవడం వ్యాధికారకమని, నాలుగు చెట్లను పెంచుకోవడం నాశనకారమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక ఇంట్లో ఒక్క అరటి చెట్టును పెంచుకోవడం ఉత్తమం. అరటి పువ్వుతో వడియాలను కూడా పెట్టుకుంటారు. ఈ వడియాలను తినడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాసకోస సంబంధమైన వ్యాధుల నుంచి బయట పడవచ్చు. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. జ్వరం, క్షయ, కఫ వాతం, ఉబ్బసం వంటి వ్యాధులు ఉన్నవారు అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఆయా వ్యాధులు తగ్గుతాయి.
స్త్రీలలో నెలసరి సమయంలో కలిగే అధిక రక్తస్రావం సమస్యను తగ్గించడంలో అరటి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. బాగా పండిన అరటి పండును 50 గ్రా.ల నాటు ఆవు నెయ్యితో లేదా నాటు గేదె నెయ్యితో కలిపి మూడు పూటలా మూడు సార్లు తింటూ ఉండడం వల్ల బహిష్టులో తీవ్ర రక్తస్రావం తగ్గుతుంది. స్త్రీలలో గర్భాశయ రోగాలు ముదిరి సోమ రోగంగా మారి యోని గుండా నిరంతరం తెల్లటి ద్రవం కారుతూనే ఉంటుంది. దీనిని వెంటనే ఆపకపోతే ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. అరటి పండును, తేనెను, పటిక బెల్లాన్ని, ఉసిరి కాయ రసం లేదా కషాయాన్ని తీసుకుని వీటన్నింటిని కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల సోమ రోగం హరించుకుపోతుంది.
బాగా పండిన అరటి పండును పిసికి కాలిన గాయాలపై లేపనంగా రాయడంవల్ల మంట, నొప్పి తగ్గి గాయాలు త్వరగా మానుతాయి. బాగా మెత్తగా ఉన్న పసుపు పచ్చ అరటి పండును తింటూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది. అరటి చెట్టు వేరును నూరి రసాన్ని తీసి 3 టీ స్పూన్ల రసాన్ని ఒక కప్పు నీటిలో కలిపి తాగుతూ ఉండడం వల్ల అతి వేడి, అతి పైత్యం రెండు రోజులల్లో తగ్గిపోతాయి. అరటి చెట్టును కాల్చి బూడిద చేసి నిల్వ చేసుకోవాలి. ఈ బూడిదను రెండు నుండి మూడు గ్రాముల మోతాదులో తీసుకుని ఒక కప్పు నీటిలో కలిపి మూడు పూటలా తాగుతూ ఉండడం వల్ల ఉదర రోగాలు తగ్గిపోతాయి. రోజూ ఒక చక్కెర కేళి అరటి పండును గోమూత్రంతో కలిపి ముద్దగా చేసి తీసుకోవడం వల్ల ఉబ్బసం రోగం తగ్గుతుంది.
అరటి పండు తొక్కను తీసి అందులో చిటికెన వేలును పెట్టి రంధ్రం చేసి అందులో మిరియాల పొడిని వేసి రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల ఎన్నో రోజుల నుండి వేధిస్తున్న దగ్గు కూడా తగ్గుతుంది. మెత్తటి అరటి పండును, అన్నాన్ని, గేదె పేడను కలిపి ముద్దగా చేసి పుండ్లపై ఉంచి కట్టు కడతూ ఉంటే పుండ్లు త్వరగా మానుతాయి. అరటి ఆకును ఎండబెట్టి కాల్చి బూడిద చేసి నిల్వ చేసుకోవాలి. ఈ బూడిదను రెండు చిటికెల మోతాదులో తీసుకుని ఒక టీ స్పూన్ తేనెతో కలిపి రెండు పూటలా తీసుకోవడం వల్ల పులి త్రేన్పులు తగ్గుతాయి. అరటి ఊచ రసం అర కప్పు మోతాదులో సేవిస్తూ ఉంటే స్త్రీలలో ఆగిన బహిష్టు మరలా వస్తుంది. ఈ విధంగా అరటి చెట్టును ఉపయోగించి మనకు వచ్చే అనేక రోగాలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.