vastu

South East : ఆగ్నేయ దిశలో వీటిని పెడితే.. అంతే సంగతులు..!

South East : వాస్తు ప్రకారం మనం అనుసరించడం వలన ఎంతటి సమస్యలైనా కూడా దూరమవుతాయి. వాస్తు ప్రకారం చేసే తప్పుల‌ వలన నష్టాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం మనం పాటించినట్లయితే ఎలాంటి కష్టమైనా కూడా తొలగి సంతోషంగా జీవించ‌వ‌చ్చు. ఆగ్నేయ దిశ చాలా ముఖ్యమైంది. ఇది ప్రజలని పునరాలోచనలో పడేస్తుంది. ప్రతికూల ప్రభావాలు ప్రతిబింబించేటప్పుడు దీనిని బాధనిచ్చే తలుపు అంటారు. ఈ దిశ నుండి వచ్చే ప్రతికూల ప్రభావాలు మనలో ఇబ్బందుల‌ని కలిగిస్తాయి. గుండె జబ్బులు, నిరాశ వంటివి కలగవచ్చు.

భార్యాభర్తల మధ్య గొడవలు కూడా రావచ్చు. విడాకులు లేదా వివాహేతర సంబంధాలు వంటివి కూడా చోటు చేసుకోవచ్చు. ఒకవైపు ఆగ్నేయ దిశ సంకల్పం, సత్యం, సంకల్ప శక్తితో లింక్ అయ్యి ఉంటే ఇంకో వైపు కోపం వంటి వాటితో లింక్ అయ్యి ఉంటుంది. ఆగ్నేయం వైపు బాత్రూం, బెడ్ రూమ్, ఇంటి ముఖ ద్వారం ఉండకుండా చూసుకోండి. ఈ దిశలో అద్దాన్ని కూడా పెట్టుకోకండి. ఈ దిశలో నిద్రపోవడం వలన మాదకద్రవ్యాల వ్యసనం, మద్యపానం, శృంగారం వంటి ప్రతికూల అలవాట్లపై నడిచేటట్టు చేస్తుంది.

do not put these in south east direction

ఆగ్నేయం వైపు వాషింగ్ మిషన్ ని పెట్టుకోవచ్చు. మిక్సీని కూడా ఈ దిశలో పెట్టుకోవచ్చు. కామధేనువు అని పిలవబడే ఆవుని కూడా ఈ దిశలో పెట్టుకోవచ్చు. సంపద పెరుగుదలకు ఇది కారణం అవుతుంది. ఈ దిశలో గోడల‌కి క్రీం కలర్, ఆకుపచ్చ కలర్ పెయింట్లు వేసుకుంటే మంచిది.

ఈ దిశలో రెండు కుందేళ్ళని పెట్టుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. ఫర్నిచర్ వంటివి పెట్టుకోవద్దు. షూ రాక్ ని పెట్టుకోవచ్చు. ఆగ్నేయం వైపు స్టోర్ రూమ్ ఉండచ్చు. ఇలా ఆగ్నేయానికి సంబంధించి ఇటువంటి తప్పులు చేయకుండా చూసుకున్నట్లయితే, మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి.

Share
Admin

Recent Posts