vastu

వాస్తు ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండకూడదు…ఒకవేళ ఉంటే అప్పులు తప్పవు..!

వాస్తు అంటే నివాసగృహం లేదా ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం.మన దేశంలో వాస్తుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. వాస్తు ప్రకారం నిర్మించుకున్న ఇంట్లో కూడా మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తుంటాం దానివలన కష్టాలు తప్పవు..అవేంటంటే…

వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియంను పెంచితే దానివలన ఇంటి యజమానికి మానసిక ఉల్లాసం ఉంటుందని, ఈతిబాధలు తప్పుతాయ‌ని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంకా అప్పుల బాధలు త‌గ్గుతాయి.. ఇంట్లో పనిచేయని గడియారాలు, హాలులో మహాభారత యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు ఉండకూడదు. ఇంటికి ఎదురుగా ఆస్పత్రులు, మాంసాహార దుకాణాలు, ఇనుము వస్తువుల తయారీ షాపులు ఉండకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

do not put these items in your home

అలాగే ఇంటి ముందు మనీ ప్లాంట్‌ తీగలు అల్లుకున్నట్లుంటే.. ఆ ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఉండ‌దని వారు చెప్తున్నారు. ఇంట్లో కప్పలు, తలకు పైన వేలాయుధంతో కూడిన కుమార స్వామి బొమ్మ, అడుగు మించిన దేవతామూర్తుల విగ్రహాలు ఉండకూడదు. వ్యాపారాలు చేసే ప్రాంతం వాస్తు ప్రకారం చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారం రూపంలో మాత్రమే ఉండాలి. తూర్పు, దక్షిణ దిశలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో పూజ చేస్తున్నవారైతే తూర్పు వైపు తిరిగి చేయాలి.

Admin

Recent Posts