vastu

ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని అప్పుగా తీసుకురాకండి.. అలా చేస్తే క‌ష్టాలే..!

ఎప్పుడూ కూడా పొరపాటున కూడా ఈ వస్తువులని అరువు తెచ్చుకోకూడదు. చాలా మంది ఏదైనా వస్తువు లేకపోతే, పక్కింటికి వెళ్లి అడిగి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఎంత అవసరం ఉన్నా కూడా ఈ వస్తువుల్ని మాత్రం అసలు తెచ్చుకోకూడదు. ఈ వస్తువులన్ని అరువు తెచ్చుకోవడం మంచిది కాదని, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. వీటి వలన ప్రతికూల ప్రభావం మీ మీద పడుతుంది. కొంతమంది స్నేహితులు దగ్గరికి వెళ్లి వాచ్ ని తెచ్చుకుంటారు. ఒకరి వాచ్ ని ఎప్పుడూ కూడా అడిగి తెచ్చుకోకూడదు. ఒకరి వాచ్ ని అడిగి పెట్టుకోవడం అస్సలు మంచిది కాదు.

అలానే ఎప్పుడూ కూడా మరొకరు చెప్పుల్ని అరువు తెచ్చుకోకూడదు. ఒకరి చెప్పులని వేసుకుంటే ప్రతికూల ఫలితాలు మీ మీద పడతాయి. అలానే ఒకరి బట్టల్ని కూడా అరువు తెచ్చుకోకూడదు. ఒకరి బట్టల్ని అరువు తెచ్చుకుని వేసుకోవడం వలన అదృష్టం మొత్తం పోతుంది. అలానే ఉంగరం ని కూడా అడిగి తెచ్చుకోకూడదు. ఒకరి ఉంగరాన్ని ఇంకొకరు అస్సలు పెట్టుకోకూడదు.

do not take these items as loan

ఆర్థిక సంక్షోభం దీని వలన ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మరొకరి ఉంగరాన్ని అడిగి పెట్టుకోవద్దు. ఒకరి దువ్వెనని కూడా అడిగి దువ్వుకోకూడదు. దువ్వెనని అసలు ఎవరికీ ఇవ్వకూడదు. అలానే ఎవరు కూడా అడగకూడదు. ఇలా చేయడం వలన ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఎప్పుడూ ఒకరు దువ్వెనని అడగద్దు. ఉప్పు కూడా ఒకరిని అడగకూడదు.

ఒకరి ఇంటికి వెళ్లి ఉప్పు తెచ్చుకోవడం వల్ల మీ సంతోషం, ఐశ్వర్యం దూరం అవుతాయి. సూదిని కూడా అడిగి తెచ్చుకోకూడదు. ప్రేమ సంబంధ సమస్యలు వస్తాయి. జీవితంలో నష్టాలు ఎదురవుతాయి. పెన్ ని కానీ పెన్సిల్ కానీ అడగకూడదు. ఇలా చేస్తే జీవితం పురోగతిని తగ్గిస్తుంది. పెన్ తీసుకోవడం వలన వాళ్ళ కష్టాలు మీపై పడతాయి.

Admin

Recent Posts