చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అయితే, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా.. మంచి జరగాలన్నా వీటిని ఫాలో అవ్వడం మంచిది. ఇంట్లో ఎప్పుడూ కూడా చెత్తాచెదారం ఉండకూడదు. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉండడం వలన ఆనందం కలుగుతుంది. ఎంతో ప్రశాంతత ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది.
అలాగే ఇంట్లో హ్యాపీగా అందరూ ఉండాలన్నా, పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా ఇంట్లో మొక్కలని పెంచాలి. వెదురు మొక్క, మనీ ప్లాంట్ ఇలాంటి మొక్కలు ఇంట్లో ఉండడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఇంట్లో ఆక్వేరియం కానీ చిన్న ఫౌంటెన్ కానీ ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. చెక్క ఫర్నీచర్ మాత్రమే ఇంట్లో ఉండేలా చూసుకోండి. వీటితో పాటుగా మంచి అందమైన వెల్కం మేట్స్, ఆర్ట్ వర్క్స్ వంటివి కూడా పెట్టండి.
ఇవి కూడా చక్కటి పాజిటివ్ ఎనర్జీని ఇంటికి తీసుకువస్తాయి. కొవ్వొత్తులు, లైట్లు, అద్దాలు ఇలాంటివన్నీ కూడా ఉండడం వలన ఇంట్లో చక్కటి ఎనర్జీ వస్తుంది. సంతోషంగా ఉండడానికి అవుతుంది. ఎరుపు, ఆరెంజ్, పసుపు వంటి రంగులు ఇంట్లో ఉండడం వలన మంచి ఎనర్జీ వస్తుంది. నీలం, ఆకుపచ్చ రంగులు బెడ్ రూమ్ లో వేయించుకుంటే రిలాక్స్డ్ గా ఉంటుంది.