ఆధ్యాత్మికం

Ghost : ఈ రాశుల వాళ్లు దెయ్యాలను చూడ‌గ‌ల‌ర‌ట‌.. అతీంద్రియ శ‌క్తులు ఉంటాయ‌ట‌..!

Ghost : మనకి మొత్తం 12 రాశులు. ఇదివరకు 13 రాశులు ఉండేవి. కాలక్రమేణా ఒక రాశిని వాడడం మానేశారు. దాంతో 12 రాశులు మాత్రమే ఉన్నాయి. అయితే ఒక్కో రాశి వారిలో ఒక్కో ప్రత్యేక లక్షణం అనేది ఉంటుంది. కొన్ని రాశుల వాళ్లకైతే అతీంద్రియ శక్తులు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మరి ఆ రాశుల గురించి, ఆ అతీంద్రియ శక్తుల‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక్కొక్కరూ ఒక్కో స్వభావంతో ఉంటారు. కొంత మంది మౌనంగా ఉంటూ ఉంటారు. లేదంటే ఆకాశం వైపు చూస్తూ ఉంటారు.

లేదంటే ఈ ప్రపంచంతో వాళ్లకి సంబంధం లేనట్లుగా కనబడుతుంటారు. దానికి కారణం వాళ్ళల్లో ఉండే అతీంద్రియాల లక్షణాలు. ఇలాంటి వ్యక్తులు ప్రత్యేకమైన వస్తువులని వాళ్ళ దగ్గర ఉంచుకుంటుంటారు. అందరిలా లేము అనే విషయం కొంతమంది గుర్తిస్తారని అంటారు. మిగిలిన వాళ్ళు చూడలేని వాటిని వీళ్ళు చూస్తారట. మిథున రాశి వారికి అధిపతి బుధ గ్రహం. దీన్ని సమాచార గ్రహం అంటారు.

these zodiac sign persons can see ghosts

మిథున రాశి వారు అపరిచితులు, దెయ్యాలు, గ్రహాంతర శక్తుల నుండి రహస్యాలని వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటార‌ట‌. వీళ్ళు చాలా తెలివైన వారు. నిద్రపోతున్నప్పుడు కూడా స్పష్టమైన కలల్ని కంటార‌ట‌. ఇతరులు భయపడే విషయాల గురించి వీళ్ళు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. వృశ్చిక రాశి వారు మరణం, ఆత్మ, పునర్జన్మ ఇలాంటి అంశాలకు సంబంధించిన వాటి మీద ఆసక్తి చూపుతార‌ట‌. ఈ రాశి వారికి స్వచ్ఛమైన జల శక్తి ఉంటుంది. అంతదృష్టిని కలిగిస్తుంది. రాక్షసుల‌ గురించి వీళ్ళు ఎంతో తేలిగ్గా చూస్తారు.

మీన రాశి వారిని వరుణగ్రహం అంటారు. ఆత్మల శక్తులు, మానసిక శిథిలాలు అలాంటి వాటి పట్ల ఆకర్షితులు అవుతారు. ఈ రాశి వారు ఆత్మలని చూడగలరు. వాళ్ళతో మాట్లాడగలరు. ఇలా ఈ మూడు రాశుల వాళ్లకి కూడా అతీంద్రియ శక్తులు ఉంటాయట.

Admin

Recent Posts