వినోదం

Sr NTR : ఎన్‌టీఆర్ ఎలాంటి ఆహారాల‌ను తినేవారో తెలిస్తే.. షాక‌వుతారు..!

Sr NTR : ఎన్టీఆర్ సినీ రంగంలోనే కాకండా రాజ‌కీయ రంగంలో కూడా తిరుగులేని వ్యక్తిగా, మహా నాయకుడిగా ఎదిగారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన న‌టుడు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే స్వభావం కలవారిగా అందరిలో ఎంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రాముడు, కృష్ణుడు వంటి పాత్ర‌ల‌తో తెలుగు ప్రజలను ఆక‌ట్టుకున్నారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొత్త‌ల్లో వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ వెండితెర దేవుడిగా కొలిచే స్థాయికి ఎదిగారు.

రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా మూడు షిఫ్టుల్లో ప‌నిచేశారు ఎన్టీఆర్. అంత‌టి బిజీ షెడ్యూల్‌లో ఉన్నా కూడా ఎన్టీఆర్ ఆహార‌శైలి ప్రత్యేకంగా ఉండేదట. ఎన్టీఆర్ ఆహారం తీసుకునే విషయంపై ఇప్ప‌టికీ అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఎన్టీఆర్ ప్రతి రోజూ ఉదయం మూడు గంటలకే నిద్రలేచి వ్యాయామం చేసి స్నానం చేసిన తరువాత అరచేతి మందంలో ఉండే 24 ఇడ్లీలు తినేవారట. ఇలా కొంత కాలం ఇడ్లీలు తిన్న ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రతిరోజూ ఉదయం భోజనం చేసేవార‌ట.

sr ntr food habits will surprise you

భోజనంలో క‌చ్చితంగా నాటుకోడి కూర ఉండేలా చూసుకునేవారు. ఇక చెన్నైలో ఎప్పుడైనా బజ్జీలు తినాలి అనుకున్నప్పుడు 30 లేదా 40 బజ్జీలను సునాయాసంగా తినేవారట. ఇక వేసవి వస్తే.. ఆయన ఆహారపు అలవాట్లలో కొన్ని కొత్త మార్పులు చేసేవారట.. ముఖ్యంగా ఎండాకాలంలో రెండు లీటర్ల బాదం పాలు కూడా ఎన్టీఆర్ తీసుకునే వారట. మధ్యాహ్నం భోజనం తర్వాత ఆపిల్ జ్యూస్ లో గ్లూకోజ్ వేసుకొని తాగేవారట.

అయితే ఎన్టీఆర్ కొత్త ప్రాంతానికి వెళ్లిన్నప్పుడు అక్కడి రుచులను కూడా ఆస్వాదించేవారట. ముఖ్యంగా రాజకీయల్లోకి వచ్చిన తరువాత చైతన్య యాత్రంలో ఆయన ప్రజలతో మమేకం అయ్యి ఎక్కడ టైమ్ దొరికితే.. అక్కడ ఏదుంటే అది తినేవారట. సౌకర్యాలు లేని ఆ టైమ్ లో సాధారణ జీవితం గడిపిన‌ ఎన్టీఆర్ ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలిచారు. ఇలా ఆయన ఫుడ్ విషయంలో కూడా ప్రత్యేకతల‌ను కలిగి ఉండేవారు అని ఆయనకు తెలిసిన వాళ్ళు చెబుతుంటారు.

Admin

Recent Posts