vastu

Vastu Tips : వంట గదిలో ఈ చిట్కాలను పాటిస్తే.. ఆ ఇంటికి ధన ప్రవాహమే..!

Vastu Tips : సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు వంట గదికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాము. ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు వంటగది ఎల్లప్పుడూ కూడా ఆగ్నేయ దిశలో ఉండాలని పండితులు చెబుతుంటారు. ఇలా వంటగది ఆగ్నేయ దిశలో ఉన్నప్పుడే మన ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని లేదంటే లేనిపోని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

మహిళలు ఎక్కువ సమయం పాటు కిచెన్ లోనే గడపాల్సి వస్తుంది కనుక కిచెన్ లో ఈ చిట్కాలను పాటించడం వల్ల మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా స్టవ్ ను వంటగదిలో ఎల్లప్పుడూ మనం తూర్పు దిశకు నిలబడే విధంగా ఉండాలి. అదేవిధంగా స్టవ్ కి దగ్గరగానే సింకు ఉండకూడదు. వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్, ఇతర సామాన్లు ఎల్లప్పుడూ నైరుతి దిశ వైపు ఉండాలి.

follow these vastu tips in kitchen for wealth

ముఖ్యంగా వంటగదిలో సింక్ ఉన్నవారు మనం తిన్న ప్లేట్లను సింక్ లో పడేస్తాము. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో అధిక మొత్తంలో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అందుకే ప్లేట్లను వెంటనే శుభ్రం చేయాలి. లేదంటే బయట వేయాలని పండితులు చెబుతున్నారు. ఇక చాలాసార్లు మన ఇంటిలో నల్లా నుంచి వాటర్ లీకేజ్ వస్తుంటుంది. ఇలా వాటర్ లీకేజ్ అవ్వటం వల్ల మన సంపద కూడా అలాగే వెళ్ళిపోతుందని పండితులు చెబుతారు. అందుకోసమే వెంటనే అలాంటి వాటికి మరమ్మత్తు చేయించాలి. మహిళలు ఈ విధమైనటువంటి చిట్కాలను పాటించడం వల్ల ఆ ఇంటిలో సంపదకు కొదువ ఉండదని పండితులు తెలియజేస్తున్నారు.

Admin

Recent Posts