vastu

Luck : స్నానం చేసే నీటిలో వీటిని వెయ్యండి.. ఇక అదృష్టానికి కొదవే ఉండదు.. అన్నీ విజయాలే..!

Luck : అదృష్టం ఉంటే మనం పడే కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. చాలామంది ఎంతో కష్టపడి పని చేస్తారు. కానీ అందరికీ అదృష్టం కలగదు. అదృష్టం ఉండి, దానికి కష్టానికి తోడైతే మిమ్మల్ని ఆపేది ఎవరు..? అదృష్టం వరించాలంటే ఈ విధంగా అనుసరించండి. ఇలా కనుక మీరు చేశారంటే కచ్చితంగా అదృష్టం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీటిని కనుక మీరు అనుసరించారంటే అన్ని పనులను పూర్తి చేయగలరు. అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది. గంగా నదిలో స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. ఈ విషయం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్నానపు నీటిలో, కొన్ని ప్రత్యేకమైన వస్తువులని కలుపుకున్నారంటే ఇక మీకు తిరుగు ఉండదు. సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా సమస్యలు ఉండవు. ఇలా చేస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరు అదృష్టాన్ని పొందగలరు. విజయం, డబ్బు, కీర్తి ఇలా దేనికి కూడా లోటే ఉండదు. పసుపులో చక్కటి గుణాలు ఉంటాయి. శరీరం నుండి ప్రతికూల శక్తిని కూడా ఇది తొలగిస్తుంది. గోరువెచ్చని నీళ్లల్లో కొంచెం పసుపు వేసుకుని, తల స్నానం చేస్తే ఎంతో శుభం కలుగుతుంది.

keep this item in bucket of water before bath for wealth

గంధాన్ని మనం పూజల్లో వాడుతూ ఉంటాము. జ్యోతిష్య శాస్త్రంలో చందనం విజయం, సంపద, కీర్తిని తీసుకువస్తుంది అని అంటారు. గంధం నూనెని కానీ గంధం పొడిని కానీ స్నానం చేసే నీటిలో కలుపుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. సానుకూల శక్తిని ఇది పెంచుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. శరీరాన్ని చల్లగా మారుస్తుంది. వేప కూడా యాంటీ బ్యాక్టీరియల్, క్రిమినాసిక లక్షణాలకి ప్రసిద్ధి.

నీటిలో వేప పువ్వుని వేస్తే అంతా శుభం కలుగుతుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. తులసి కూడా ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. కాబట్టి మీరు తులసి ఆకుల్ని కూడా స్నానం చేసే నీళ్లలో వేయొచ్చు. తులసి ఆకులనైనా ఉపయోగించచ్చు. గులాబీ రేకులు కూడా స్నానం చేసే నీటిలో వేయండి. ప్రేమ, ఆనందం, విజయాన్ని గులాబీ రేకులు ఇస్తాయి. ఇలా వీటిని మీరు స్నానం చేసే నీటిలో వేసుకుంటే అదృష్టం మీ వెంట ఉంటుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

Admin

Recent Posts