vastu

Vastu Tips : మీ ఇంటి సింహ ద్వారం ముందు ఈ ఫోటో పెడితే.. మీ ద‌శ తిరిగిన‌ట్లే..!

Vastu Tips : మ‌న‌లో చాలా మంది ఇంటికి, ఇంట్లోని వారికి న‌ర‌దిష్టి త‌గ‌ల‌కూడ‌ద‌ని ఇంటి ప్ర‌ధాన ద్వారంపై లోప‌ల మ‌రియు బ‌య‌ట దేవుళ్ల ఫోటోల‌ను ఉంచుతారు. మ‌న‌కు ఎక్కువ‌గా గ‌ణ‌ప‌తి ఫోటోలు, గ‌జ ల‌క్ష్మీ ఫోటోలు క‌నిపిస్తూ ఉంటాయి. చాలా మంది హిందువులు ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే ఇంటి ప్ర‌ధాన ద్వారంపై దేవుళ్ల ఫోటోల‌ను ఉంచ‌వ‌చ్చా.. లేదా… ఒకవేళ ఉంచితే ఎటువంటి ఫోటోల‌ను ఉంచాలి.. దీని గురించి పండితులు ఏం చెబుత‌న్నారు.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటికి చాలా ముఖ్య‌మైన వాటిల్లో ఇంటి ప్ర‌ధాన ద్వారం ఒక‌టి. ఈ ద్వారం గుండానే మ‌నం ఇంట్లోకి బ‌య‌టికి రాక‌పోక‌లు సాగిస్తూ ఉంటాము. మ‌న ఇంటికి బంధువులు, బ‌య‌ట వ్య‌క్తులు ఎవ‌రు వ‌చ్చిన ఈ ద్వారం గుండానే వ‌స్తూ ఉంటారు.

అయితే ఇంటి ప్ర‌ధాన ద్వారానికి బ‌య‌ట వైపు ఎటువంటి దేవుళ్ల ఫోటోల‌ను ఉంచ‌కూడ‌ద‌ని పండిత‌లు చెబుతున్నారు. ఒక‌వేళ ఎవ‌రైనా ఇలా ఉంచాలి అనుకుంటే శంఖు చ‌క్రాల‌ను, నామాల ఫోటోల‌ను ఉంచ‌డం మంచిద‌ని వారు చెబుతున్నారు. అలాగే ఇంటి ప్ర‌ధాన ద్వారానికి లోప‌లి వైపు ల‌క్ష్మీ స‌మేత వెంక‌టేశ్వ‌ర స్వామి ఫోటోను, అమ్మ‌వారు ల‌క్ష్మీ దేవి ఫోటోను, గ‌ణ‌ప‌తి ఫోటోను, కుల దేవ‌త‌ల‌కు సంబంధించిన ఫోటోల‌ను ఉంచ‌వ‌చ్చు. ఇక న‌ర‌దిష్టి, వాస్తు దోషం ఉండ‌కూడ‌దు అనుకునే వారు ఐశ్వ‌ర్య కాళీ ఫోటోను లేదా గోమాత స‌మేత ఐశ్వ‌ర్య కాళీ ఫోటోను ఉంచ‌వ‌చ్చు. మ‌న ఇంటికి చాలా మంది వ‌స్తూ పోతూ ఉంటారు. వారు పైకి మ‌న‌తో మంచిగా మాట్లాడిన‌ప్ప‌టికి ఇంట్లోని వ‌స్తువుల‌ను ఇంటి అందాన్ని చూసి లోలోప‌ల చెడు దృష్టితో ఆలోచిస్తూ ఉంటారు. ఈ చెడు దృష్టి, న‌ర‌దిష్టి వంటివి మ‌న‌పై ప‌డ‌కుండా ఉండాలంటే గోమాత స‌మేత ఐశ్వ‌ర్య కాళీ ఫోటోను ఉంచ‌డం మంచిద‌ని పండితులు చెబుతున్నారు.

put this photo at your home main entrance for wealth put this photo at your home main entrance for wealth

అలాగే ఇంటి ప్ర‌ధాన ద్వారానికి ఎదురుగా ఉండే గోడ‌పై కేవ‌లం గ‌ణ‌ప‌తి ఫోటోను మాత్ర‌మే ఉంచాల‌ని వారు చెబుతున్నారు. చాలా మంది ప్ర‌ధాన ద్వారానికి ఎదురుగా ఉండే గోడ‌పై ల‌క్ష్మీ స‌మేత వెంక‌టేశ్వర స్థామి ఫోటోను ఉంచుతారు. ఇలా చేయ‌డం మంచిది కాద‌ని ఇలా చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి బ‌య‌ట‌కు పోతుంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో తూర్పు, ప‌డ‌మ‌ర దిక్కుల్లోనే దేవుడి ఫోటోల‌ను ఉంచి పూజించ‌డం మంచిద‌ని వారు చెబుతున్నారు. ఉత్త‌ర ,ద‌క్షిణ దిక్కులల్లో దేవుడి ఫోటోల‌ను ఉంచి వాటిని పూజించిన‌ప్ప‌టికి ఎటువంటి ఫ‌లితం ఉండ‌ద‌ని వారు సూచిస్తున్నారు.

Admin

Recent Posts