ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పలు ఛాలెంజెస్ ట్రెండింగ్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఐస్ బకెట్ ఛాలెంజ్ నుండి ‘వాట్ డూ యు డూ ఫర్ లివింగ్’ వరకు, పలు ఛాలెంజ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ప్రస్తుతం ఓ ఛాలెంజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇటీవల, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న ఒక అమ్మాయి, కంటెంట్ క్రియేటర్‌తో సంభాషించినప్పుడు గమ్మత్తైన సమాధానం ఇచ్చింది. ఇండియాలో ఎన్ని దేశాలు ఉన్నాయని ప్రశ్నించగా, ఆమె ఏకంగా 300 దేశాలు ఉన్నాయని చెప్పడం విశేషం.
కాలేజీ క్యాంపస్‌కి వెళ్లిన వ్యక్తి ఒక అమ్మాయిని పిలిచి భారతదేశంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అని అడిగాడు. ఆ ప్రశ్నతో కాస్త అయోమయానికి గురైన అమ్మాయి, కాస్త ఆలోచించి తల గోక్కుంది. ఆ ప్రశ్న సరైందో లేక తప్పో అర్ధం చేసుకోకుండానే వెంటనే సమాధానం చెబుతుంది. ఇండియాలో ఎన్ని దేశాలు ఉన్నాయి అన్న ప్రశ్నకి 300 అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు అని అంటుంది. దీనికి ఆ అబ్బాయి “300?” దానికి సమాధానంగా ఆ అమ్మాయి “అవును” అంటుంది. దీనికి బిత్తర పోయిన ఆ అబ్బాయి ఆమెని ఏం చదువుతున్నావు అని అడుగుతాడు.
అయితే దానికి ఆ అమ్మాయి సమాధానం ఇస్తూ.. బీఏ కోర్సు మూడో సంవత్సరం చదువుతున్నట్లు వెల్లడించింది. ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ, 300 దేశాలు ఇండియాలో లేవు అనేది ఆ అమ్మాయికి తెలియరాలేదు. 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో భారతదేశం కూడి ఉంది అనే ప్రాథమిక వాస్తవం ఈ అమ్మాయికి తెలియకపోవడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం, ఈ ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి, వాటిలో 193 ఐక్యరాజ్యసమితి సభ్యులు ఉన్నారు. ఈ వీడియోను అన్సారీ ఇజాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిని 23 లక్షలకు పైగా వీక్షించారు. మీరు కూడా ఈ వీడియోని చూసి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి.