హెల్త్ టిప్స్

Heart Health : ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉంటే మీ గుండె బ‌ల‌హీనంగా ఉంద‌ని అర్థం..!

Heart Health : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. మంచి ఆహారాన్ని తీసుకోవడం మొదలు వ్యాయామం, నిద్ర ఇవన్నీ కూడా సరిగా ఉండేటట్లు చూసుకుంటారు. ఈ రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో గుండె సమస్యలతో చాలామంది చనిపోతున్నారు. గుండె ఆరోగ్యం పట్ల క‌చ్చితంగా శ్రద్ధ వహించాలి. లేకపోతే అనవసరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే హృదయ స్పందన సాధారణంగా ఉండాలి. చాలామంది వైద్యులు తమ రోగులని 50 నుండి 70 బీట్స్ పరిధిలో ఉండాలని అంటూ ఉంటారు. ఎప్పుడు కూడా బీపీ నార్మల్ లో ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. బీపీ ఎక్కువ అయితే గుండె సమస్యలు బాగా ఎక్కువ వస్తాయి. గుండె బాగా పనిచేసేటప్పుడు ఆక్సిజన్, పోషకాలని గుండె అందుకుంటుంది.

if you have these signs then your heart must be weak

మంచి జీవనశైలిని పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. గుండె సమస్యలు కూడా ఉండవు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బరువు కూడా స‌రిగ్గా ఉండాలి. అధిక బరువు సమస్యతో చాలా మంది ఈ రోజుల్లో బాధపడుతున్నారు. అధిక బరువు వలన కూడా గుండె సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ అయినా కూడా గుండె సమస్యలు వస్తాయి.

నోటి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. నోటి ఆరోగ్యం బాగుంటే గుండెజబ్బులు రాకుండా ఉంటాయి. నోటి నుండి బ్యాక్టీరియా గుండెకు చేరుతుంది. గుండెపై ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి నోటి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. ప్రతిరోజూ గుండె ఆరోగ్యం బాగుండడానికి శ్వాస సంబంధిత వ్యాయామాలను చేస్తూ ఉండండి. గుండె ఆరోగ్యంగా ఉండడానికి మంచి జీవనశైలి, మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు సహాయపడతాయి. ఇలా మీరు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. గుండె సమస్యలు లేకుండా ఉండొచ్చు.

Admin

Recent Posts