viral news

Viral Video : ఫ్లోర్ తుడిచిన విష‌యం మ‌రిచింది.. డ్యాన్స్ చేస్తూ నేల‌పై బొక్క బోర్లా ప‌డింది.. వీడియో..!

Viral Video : సినిమా పాట‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే. ఇష్ట‌మైన పాట వస్తే చేస్తున్న ప‌నిని కూడా ఆపి ఆ పాట‌ను వింటుంటారు. టీవీల్లో పాట‌లు వ‌స్తే క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తుంటారు. ఇష్ట‌మైన పాట‌ల‌ను కొంద‌రు కూనిరాగాలు కూడా తీస్తుంటారు. అయితే ఇలా పాట‌లు చూసే స‌మ‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే ఇదిగో ఈ యువ‌తికి జ‌రిగిన‌ట్లే జ‌రుగుతుంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

ఓ యువ‌తి ఇంట్లో ఫ్లోర్‌ను నీటితో తుడుస్తూ.. టీవీలో వ‌స్తున్న పాట‌కు దృష్టి మ‌ర‌ల్చింది. దీంతో ఫ్లోర్‌ను తుడుస్తున్నాన‌న్న విష‌యం కూడా మ‌రిచిపోయింది. ఆ పాట‌కు అనుగుణంగా డ్యాన్స్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఫ్లోర్ త‌డిగా ఉంది క‌నుక ఆమె డ్యాన్స్‌కు కాలు జారింది. దీంతో నేల‌పై బొక్క బోర్లా ప‌డింది. అయితే ఆ త‌రువాత ఏం జ‌రిగింది.. అన్న విష‌యం తెలియ‌దు. కానీ అదే స‌మ‌యంలో ఈ సంఘ‌ట‌న‌ను వీడియో తీసి దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. అది వైర‌ల్ అవుతోంది. చాలా మంది ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు.

girl fell on floor for dance video

పాటలు అంటే ఎవ‌రికైనా ఇష్టంగానే ఉంటుంది. అయితే టీవీలో ఇష్ట‌మైన పాట వ‌స్తే మ‌నం చేసే ప‌ని ఏంటి.. అనేదాన్ని గుర్తుంచుకోవాలి. లేదంటే ఇలా జ‌రుగుతుంది.. అని నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Admin

Recent Posts