సోషల్ మీడియా ద్వారా మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియా లో కొన్ని వీడియోస్ కూడ కనపడుతుంటాయి. ఒక్కోసారి కొన్ని వీడియోలు షాకింగ్ గా కూడా ఉంటాయి. ఈరోజుల్లో దొంగతనాలు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిందే. దొంగతనాలు, స్కామ్ లు చూస్తుంటే షాకింగ్ గా ఉంటున్నాయి. ఒక దొంగతనానికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక్కడ ఏం జరిగిందంటే, రైలు బ్రిడ్జి పైనుంచి వెళ్తోంది. రైలులో నిలబడిన వ్యక్తి గేటు దగ్గర నిల్చుని వీడియో తీస్తున్నారు. ఇక్కడ దాకా అంతా బానే ఉంది. కానీ కొన్ని సెకండ్లలోనే ఒక వింత జరిగింది. అతనికి మాత్రం పెద్ద షాక్ అని చెప్పొచ్చు. అనుకోకుండా ఫోన్ ని కోల్పోయాడు.
నార్మల్ స్పీడ్ లో ఈ వీడియోని చూసినప్పుడు మనకు ఏమీ అర్థం అవ్వదు. ఫోన్ పడిపోయింది ఏమో అనుకుంటాం. కానీ నెమ్మదిగా చూసినట్లయితే బ్రిడ్జ్ కి ఒక వ్యక్తి తాడు కట్టి నిలబడి, ఫోన్ ని లాక్కుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఒక ఫోన్ ని దొంగలించడానికి ఇంత రిస్క్ చేయాలా?, బ్రిడ్జికి తాడు కట్టుకుని హ్యాంగ్ అవుతూ ట్రైన్ లో వెళ్తున్న ప్యాసింజర్ ఫోన్ ని దొంగలించాడు. ఫోన్ తాలూకా యజమాని మాత్రం ఒక్కసారిగా కంగు తిన్నాడు.