ఫ్లోరిడా రాష్ట్రాన్ని శక్తివంతమైన హరికేన్ మిల్టన్ వణికిస్తోంది. పశ్చిమ తీరంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన కేటగిరి 5 తుఫాను ఇదేనని తెలుస్తోంది. పశ్చిమ తీరంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలని, అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. ప్రాణమా లేదా మరణమా మీరు నిర్ణయించుకోవాలని సూచించారు. లక్షల మంది ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని తీరం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.
నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ చెందిన ఓ పరిశోధనా విమానము ప్రమాదవశాత్తు హరికంలోకి దూసుకు వెళ్ళింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫ్లోరిడా తీరాన్ని హరికేన్ తాకడంతో గంటకు 150 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తున్నాయి.
భారీ వర్షం కురుస్తుండగా అనుకోకుండా హరికేన్ లోకి పిగ్గీ లాక్‌హీడ్ WP-3D ఓరియన్ ఎయిర్‌క్రాఫ్ట్ దూసుకు వెళ్ళింది. అయితే అందులో నలుగురు పరిశోధకులు ఉన్నట్లు తెలుస్తోంది. భయంకరమైన గాలులు దాటికి విమానం తీవ్ర కుదుపులకి గురవడం వలన వస్తువులన్నీ పడిపోయాయి. పరిశోధకులు తీవ్రంగా శ్రమించి కొంచెం సేపు తర్వాత విమానాన్ని మరో పక్కకు తీసుకువెళ్లడంతో ప్రమాణం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.