ఒక యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఒక రీల్ చేస్తూ ఎంతో రిస్క్ తీసుకున్నాడు. ఈ సంఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. అతనికి కంటెంట్ క్రియేట్ చేయడం ఎంతో ఇష్టం. దీంతో రిస్క్ చేయడానికి సిద్ధమయ్యాడు. షూట్ చేసే ప్రదేశం లో సేఫ్టీ నెట్ ను బిల్డింగ్ దగ్గర తీసేసాడు. ఈ విధంగా వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి మూడు ఫ్లోర్ల నుండి కిందకు పడిపోయాడు.
ఇలా చేయడం వలన ఎంతో రిస్క్ చేసి వీడియో షూట్ చేయడానికి ప్రయత్నించగా తన ప్రాణాలను కోల్పోయాడు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ఇటువంటి రీల్స్ అవసరం లేదు అని నేటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. దీంతో పోలీసులు మరియు లోకల్ అథారిటీస్ పబ్లిక్ ను వార్న్ చేస్తున్నారు.
ఇటువంటి రిస్క్ చేసి ప్రాణాలను కోల్పోవద్దని చెప్తున్నారు. సోషల్ మీడియాలో మంచి పేరును పొందాలంటే ఎటువంటి రిస్క్ చేయాల్సిన అవసరం లేదని మంచి కంటెంట్ తో కూడా పేరు పొందవచ్చని అంటున్నారు. ఇలాంటివి ఎక్కడొక్కడ జరగడం మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి రిస్క్స్ మాత్రం అస్సలు చెయ్యొద్దు. ప్రాణాన్ని రిస్క్ చెయ్యొద్దు.