Chair Pose : రోజూ ఉద‌యాన్నే 1 నిమిషం పాటు ఈ ఆస‌నం వేయండి.. అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చు..

Chair Pose : ప్ర‌స్తుత ఆధునిక జీవ‌న విధానం చాలా మంది దిన‌చ‌ర్య‌ను మార్చేసింది. ఉద‌యాన్నే ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని మొద‌లు పెడుతున్నారు. రాత్రి నిద్రించే వ‌ర‌కు మ‌న శ‌రీరం అనే మెషిన్ ప‌రుగులు పెడుతూనే ఉంది. ఆగ‌డం లేదు. దీంతోపాటు ఆహార‌పు అల‌వాట్లలోనూ అనేక మార్పులు వ‌చ్చాయి. నిద్ర‌లేమి, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. ఇక వ్యాయామం లేదా శారీర‌క శ్ర‌మ అన్న మాటే లేదు. దీంతో అనేక వ్యాధుల బారిన ప‌డుతున్నారు.

do this Chair Pose everyday for these benefits

 

అయితే రోజూ యోగా ఆస‌నాల‌ను వేయ‌డం వ‌ల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. యోగా ఆస‌నాల‌ను వేయ‌డం చాలా సుల‌భ‌మే. కొన్ని ఆస‌నాల‌ను మ‌రీ ఎక్కువ సేపు వేయాల్సిన ప‌ని కూడా లేదు. ఉదాహ‌ర‌ణ‌కు.. కింద ఇచ్చిన చెయిర్ పోజ్ (కుర్చీ ఆస‌నం) ను రోజూ క‌నీసం 1 నిమిషం పాటు వేయ‌గ‌లిగితే చాలు.. ఎన్నో వ్యాధుల నుంచి బ‌యట ప‌డ‌వ‌చ్చు. ఈ చెయిర్ పోజ్‌ను రోజూ వేయ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. దీంతో తొడ‌లు, మ‌డ‌మ‌లు, పిక్క‌లు దృఢంగా మారుతాయి.

చెయిర్ పోజ్‌ను ఇలా వేయండి

ఈ ఆస‌నాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వేయాల్సి ఉంటుంది. ముందుగా నేలపై చాప వేసి దాని మీద నిల‌బ‌డాలి. మోకాళ్ల మీద గోడ కుర్చీ వేసిన‌ట్లు వంగాలి. త‌రువాత చేతుల‌ను పైకెత్తి ఎదురుగా చూడాలి. ఛాతి భాగాన్ని కొద్దిగా ముందుకు వంచాలి. ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండాలి. ఆరంభంలో క‌నీసం 1 నిమిషం పాటు అయినా ఉండే ప్ర‌య‌త్నం చేయాలి. త‌రువాత అల‌వాటు అయ్యే కొద్దీ రోజూ కాస్తంత స‌మ‌యాన్ని పెంచుతూ పోవాలి. ఇలా ఈ ఆస‌నాన్ని రోజూ సుల‌భంగా వేయ‌వ‌చ్చు.

చెయిర్ పోజ్‌ను వేయ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ఆస‌నం వేయ‌డంవ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. గ్యాస్, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. సుఖ విరేచ‌నం అవుతుంది.

ఈ ఆస‌నం వ‌ల్ల న‌డుము చాలా దృఢంగా మారుతుంది. న‌డుం నొప్పి త‌గ్గుతుంది. వెన్నెముక దృఢంగా మారుతుంది. తొడ‌లు, కాళ్లు దృఢంగా మారుతాయి. వెన్నెముక సాగే గుణాన్ని పొందుతుంది. వెన్ను నొప్పి త‌గ్గుతుంది. నిత్యం కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని ఎక్కువ సేపు ప‌నిచేసేవారికి వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది. శ‌రీరం యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా ప‌నిచేస్తారు. అల‌స‌ట త‌గ్గుతుంది. శ‌క్తి పెరుగుతుంది.

Editor

Recent Posts